Begin typing your search above and press return to search.
త్వరలో కోటి ల్యాప్ లు, స్మార్ట్ ఫోన్లు ..ఎక్కడంటే..?
By: Tupaki Desk | 21 Dec 2021 11:50 AM ISTఉత్తరప్రదేశ్లో మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికార బీజేపీతో పాటు కాంగ్రెస్, ఎస్పీ ఇతర పార్టీలు ఎన్నికలు సిద్దమవుతున్నాయి. ఇందులో భాగంగా ప్రజలను ఆకట్టుకునేందుకు ఇప్పటి నుంచే పరోక్షంగా ప్రచారం చేస్తున్నాయి. ప్రధాన మంత్రి మోదీ ఇటీవల వారణాసిలో పర్యటించి ప్రజల దృష్టిని ఆకర్షించారు.
రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి గురించి చర్చించారు. మరోవైపు కాంగ్రెస్ సైతం ఇక్కడ పాగా వేసేందుకు ఇప్పటికే వ్యూహాన్ని రచిస్తోంది. స్వయంగా రాహుల్ పాదయాత్ర చేపట్టి ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇక తాజాగా సీఎం యోగి ఆదిత్యనాథ్ విద్యార్థులకు ల్యాబ్ లు, స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఎన్నికల సమయం అతి కొద్ది దూరంలో ఉన్నందుకు అధికార బీజేపీ మరోసారి గెలిచేందుకు వ్యూహం పన్నుతోంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల వారీగా ఇన్ చార్జీలను నియమించింది. పశ్చిమ ప్రాంతం బీజ్ కు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను నియమించారు. బ్రీజ్ ఏరియాకు రక్షణ మంత్రి అవథ్, కాశీ ప్రాంతాల బాధ్యతలు అప్పగించారు.
కాన్పూర్ రీజియన్ లకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను నియమించారు. అలాగే బూద్ అధ్యక్షులుగా పార్టీ ఇన్ చార్జులను నియమించారు. ఇలా సీనియర్ నేతలను నియమించడంపై ఇక్కడ గెలుపుపై బీజేపీ ఏ విధమైన వ్యూహం రచిస్తుందో అర్థం చేసుకోవచ్చు.
తాజాగా సీఎం యోగి ఆదిత్యనాథ్ రాష్ట్ర వ్యాపత్ంగా కోటి ల్యాప్ లు, స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. మాజీ ప్రధాని వాజ్ పేయి జయంతి సందర్భంగా ఈనెల 25న ఆ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. అయితే వాజ్ పేయి జయంతిని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నా ఎన్నికల కోసమేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఇప్పటికే ప్రచారాన్ని మొదలుపెట్టిన సమాజ్ వాదీ పార్టీ జాతీయ నేత అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ ‘యోగికి ల్యాబ్ ఆపరేటింగ్ తెలియదు... అందుకే వాటిని విద్యార్థులకు పంపిణీ చేస్తున్నారు’ అని విమర్శించారు.
యూపీలో రెండోసారి అధికారంలోకి రావడం బీజేపీకి కత్తిమీద సాములా మారింది. ఎందుకంటే ఇప్పటికే ఆ పార్టీకి లఖింపూర్ మచ్చ పడింది. రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో కేంద్ర మంత్రి కుమారుడు అజిత్ మిశ్రా రైతులను తొక్కి చంపాడని ఆరోపిస్తున్నారు.
ఈ కేసు దర్యాప్తు వేగంగా జరుపుతూ నిందితులను అరెస్టు చేసినా ఆ వేడి చల్లారడం లేదు. దీంతో రైతులు బీజేపీపై ఆగ్రహంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇదే అంశాన్ని హైలెట్ చేస్తూ ప్రతిపక్షాలు యాత్రలు నిర్వహిస్తున్నారు.
వ్యవసాయ చట్టాలపై సంవత్సరం పాటు ఆందోళన చేసిన రైతులు ఇటీవలే ఇంటిముఖం పట్టారు. కానీ మరణించిన రైతుల విషయంలో పరిహారం గురించి ఏ విధమైన ప్రకటన చేయలేదు.
దీంతో మరణించిన రైతు కుటుంబాలకు పరిహారం కల్సించడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నారు. అయితే వీటిని ఎఫెక్ట్ పడకుండా ఇటీవల ప్రధాన మంత్రి మోదీ స్వయంగా యూపీలో పర్యటించి ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.
అయితే యూపీ ఓటర్ నాడీ ఎటువైపు ఉందో అప్పుడే చెప్పలేమని కొన్ని సర్వే సంస్థలు పేర్కొంటున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో మరోసారి వస్తే అభివృద్ధి కొనసాగుతుందని రాష్ట్ర బీజేపీ నాయకులు అంటున్నారు.
కానీ ఇప్పటికే రైతు ల విషయంలో మోదీ సర్కార్ తీరుపై విమర్శిస్తూ ప్రతిపక్షాలు ప్రజలను ఆకర్షిస్తున్నారు. మరోసారి అధికారంలోకి వస్తే రైతు వ్యతిరేక కార్యక్రమాలు చేపడుతారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఎటువైపు మళ్లుతారోనన్న ఆసక్తి నెలకొంది.