Begin typing your search above and press return to search.
బండి శాపనార్థాలు వింటే ఉలిక్కిపడాల్సిందే
By: Tupaki Desk | 15 Jun 2022 7:00 PM ISTరాజకీయాల్లో విమర్శలు.. ఘాటు వ్యాఖ్యలు.. తీవ్రంగా విరుచుకుపడటం లాంటివి మామూలే. తెలుగు రాజకీయాల్లో రాజకీయ ప్రత్యర్థులపై వాడే భాషలో గౌరవ మర్యాదల్ని కనిష్ఠ స్థాయికి తగ్గించేసిన క్రెడిట్ కచ్ఛితంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కే దక్కుతుందని చెప్పాలి.
తెలంగాణ ఉద్యమ వేళలోనే కాదు.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన నోటి నుంచి వచ్చే మాటల తీవ్రతలో మాటల్లో మార్పు రాని పరిస్థితి. దీంతో.. కేసీఆర్ భాషను బాగా స్టడీ చేసిన తెలంగాణ రాజకీయ నేతలు.. ఆయనకు మిన్నగా మాటలు నేర్చుకోవటమే కాదు.. వాటిని నిర్మోహమాటంగా వాడేస్తున్న వైనం అంతకంతకూ ఎక్కువ అవుతోంది.
దీంతో.. నేతల మాటల్ని వినటం.. భరించటం కష్టంగా మారుతున్న పరిస్థితి. దీనికి తోడు ఎన్నికలు ఏ క్షణంలో అయినా వచ్చే అవకాశం ఉందని.. ముందస్తు దిశగా కేసీఆర్ ఆలోచనలు సాగుతున్నాయన్న అంచనాలు.. వీటికి బలం చేకూరేలా మంత్రి కేటీఆర్ సైతం.. ఎన్నికలపై చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించేశాయని చెప్పాలి. దీంతో.. ఏ చిన్న అవకాశాన్ని విడిచిపెట్టకుండా తెలంగాణ అధికారపక్షంపై విరుచుకుపడే ధోరణిని విపక్ష బీజేపీ.. కాంగ్రెస్ లు పోటాపోటీగా ప్రదర్శిస్తున్నాయి.
మూడు రోజుల క్రితం గొరవెల్లి భూనిర్వాసితుల విషయంలో అధికారులు.. పోలీసులు వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నవేళ.. ఆ ఇష్యూను టేకప్ చేసింది బీజేపీ. తాజాగా సదరు భూ నిర్వాసితులను వెంట పెట్టుకొని గవర్నర్ తమిళ సైని కలిశారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. వారితో పాటు సర్పంచ్ లను కూడా వెంట పెట్టుకొని వెళ్లారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు.. అందుకు వాడిన భాషను ఉలికిపాటుకు గురి కావాల్సిందే. ఆయన అన్న మాటల్ని ఆయన మాటల్లోనే వింటే.. తీవ్రత ఇట్టే అర్థమవుతుంది.
- సర్పంచ్ ల సమస్యలు.. గౌరవెల్లి భూనిర్వాసితులు.. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాం. సర్పంచ్ ల హక్కులు కాపాడుతామని గవర్నర్ హామీ ఇచ్చారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ లో నీటి కాదు.. ప్రభుత్వం రక్తాన్ని ప్రవహింపజేస్తోంది. పాపం ఊరికే పోదు.. పిచ్చోడి లెక్క కేసీఆర్ రోడ్ల మీద తిరిగే సమయం దగ్గర పడింది.
- గౌరవెల్లి భూ నిర్వాసితుల పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ రాక్షసుడి మాదిరి ప్రవర్తించాడు. సీఐ రఘుపతి మహిళల పట్ల అసహ్యకరంగా ప్రవర్తించాడు. కల్వకుంట్ల ఇంట్లో వారు మాత్రమే మహిళలా? పోలీసులు, టీఆర్ఎస్ నేతలు కలసి పేదలపై దాడి చేయటం దుర్మార్గం. అర్థరాత్రి గ్రామల్లో పోలీసులు ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారు.
- తెలంగాణ రైతులను వదిలేసి.. పంజాబ్ రైతులకు నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఏంటి? న్యాయ బద్ధమైన నష్టపరిహారం లభించేవరకు పోరాడుతాం. కమిషన్ కోసమే గౌరవెల్లి ప్రాజక్ట్ అంచనాలు పెంచారు. 12 ఏళ్లుగా పరిహారం కోసం బాధితులు ఎదురుచూస్తున్నారు.
- సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లకు మధ్య సీఎం కేసీఆర్ కొట్లాట పెట్టాడు. సస్పెండ్ పేరుతో సర్పంచ్ లను ప్రభుత్వం గుప్పిట్లో పెట్టుకుంది. సర్పంచ్ లు కూలీ నాలీ చేసుకోవాల్సిన పరిస్థితులు సీఎం కేసీఆర్ కల్పించాడు. కేంద్ర నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్ లను ఇబ్బందులకు గురిచేస్తోంది. సర్పంచ్ లకు పూర్తి అధికారాలు బదలాయిస్తామని కేసీఆర్ ఇచ్చిన హామీ ఎక్కడ?