Begin typing your search above and press return to search.

గేర్ మారుస్తున్న బీజేపీ.!

By:  Tupaki Desk   |   14 Jun 2020 11:00 PM IST
గేర్ మారుస్తున్న బీజేపీ.!
X
కేంద్రంలో అధికారమే అండగా ఆంధ్రప్రదేశ్ లో పాగా వేయాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు ఇన్నాళ్లు స్లోగా వెళుతున్న బీజేపీ ఇప్పుడు గేర్ మార్చేసినట్టే కనిపిస్తోంది. ఓ పక్క తెలుగుదేశం పార్టీ వరుసగా అరెస్ట్ లు, నాయకుల వలసలతో బలహీనపడుతూ వస్తుంటే ఇదే అవకాశంగా బలపడాలని బీజేపీ స్కెచ్ గీస్తోందట..

అధికార వైసీపీలోకి టీడీపీ ఎమ్మెల్యేల జంపింగ్ కొనసాగుతోంది. త్వరలోనే 10 మంది వరకు వైసీపీలో చేరడానికి డిసైడ్ అయ్యారని తెలుస్తోంది. ఇదే జరిగితే త్వరలోనే విపక్ష హోదాను చంద్రబాబు కోల్పోయే పరిస్థితి దగ్గరలోనే ఉన్నట్లు స్పష్టం అవుతోంది.

ఈ నేపథ్యంలో టీడీపీ బలహీనతను క్యాష్ చేసుకోవాలని బీజేపీ ఎత్తులు వేస్తోంది. అందులో భాగంగానే అధికార వైసీపీ తప్పులను ఎత్తి చూపి ప్రతిపక్షంగా ఎదగాలని బీజేపీ ప్లాన్ చేస్తోందట.. కేంద్రం ఆంధ్రప్రదేశ్ కు సాయం చేస్తున్నది ఎంతో తెలుపుతూ వైసీపీని బుక్ చేయాలని చూస్తోందట..

ఏపీలో బలపడేందుకు బీజేపీ తాజాగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ను తిరిగి యాక్టివ్ చేయబోతున్నట్టు సమాచారం..ఏపీ వ్యవహారాల ఇన్ చార్జి సునీల్ ధేవధర్ తోపాటు ఏపీ బీజేపీని ఈయనే నడిపించనున్నాడట.. సునీల్ దేవధర్ బీజేపీ పాత - కొత్త నేతల మధ్య సమన్వయం సాధించడం లేదని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. టీడీపీ అనుకూల వైఖరితో కొందరు బీజేపీ పుట్టిముంచుతున్నారన్న భావన అధిష్టానంలో ఉంది.

దీంతో ఏపీ బీజేపీ రంగంలోకి దిగిన రాంమాధవ్ తాజాగా తమ టార్గెట్ అధికార వైసీపీ అని.. ఆ పార్టీ తప్పు ఒప్పులపైనే మాట్లాడాలని నేతలకు దిశానిర్ధేశం చేసినట్టు తెలుస్తోంది. కేంద్రం ఏపీకి 10వేల కోట్ల రూపాయలు పన్నుల రూపంలో ఇచ్చిందని.. దాన్ని ప్రచారం చేయాలని బీజేపీ శ్రేణులకు హితవు పలికారట.. మరి రాంమాధవ్ ఎంట్రీతోనైనా బీజేపీ ఏపీలో కోలుకుంటుందా? లేదా అన్నది వేచిచూడాలి.