Begin typing your search above and press return to search.
ఈ మాజీల వల్ల బీజేపీకి పని అవుద్దా?
By: Tupaki Desk | 17 Nov 2020 3:40 PM ISTదుబ్బాకలో గెలుపుతో బీజేపీ ఊపు మీదుంది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోనూ విజయం సాధించి 2024లో తెలంగాణపై కాషాయ జెండా ఎగురవేయాలని పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే కమలం గూటికి వలసలు పోటెత్తుతున్నాయి.
జీహెచ్ఎంసీ ఎన్నికల నగారా ఈరోజు మోగింది. డిసెంబర్ 1న పోలింగ్.. 4న కౌంటింగ్ అని తెలంగాణ ఈసీ ప్రకటించింది. రేపటి నుంచే నామినేషన్లు వేయాలని సూచించింది. దీంతో పార్టీలన్నీ అలెర్ట్ అయ్యాయి. అధికార టీఆర్ఎస్ ఇప్పటికే అన్ని సిద్ధం చేసుకుంది. బీజేపీ సైతం రంగంలోకి దిగింది.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆయా వార్డులు, డివిజన్లలో మెరుగైన నేతలు ఎవరైనా సరే బీజేపీ టికెట్ కోసం ప్రయత్నించవచ్చని ఇప్పటికే బీజేపీ ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. బీజేపీ తరఫున పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న వారు తమ బయోడేటాలను ఇవ్వాలని కోరుతోంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలలోపు ఆశావాహుల నుంచి ఆయా జిల్లాల అధ్యక్షులు బయోడేటాలు తీసుకోనున్నారు. గ్రేటర్ పరిధిలో ఆరుగురు అధ్యక్షులను బీజేపీ నియమించింది. డివిజన్లు వారీగా అభ్యర్థుల పనితీరుపై రాష్ట్ర నాయకత్వం సర్వే చేయించనుంది. సర్వేలో ముందు వరుసలో ఉన్న వారికే టికెట్లు ఇస్తామని బీజేపీ చెబుతోంది.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ పీఠమే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ బీజేపీ ఈ మేరకు చేరికలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగానే మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డితో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈమె 2009 నుంచి 2012 వరకు కాంగ్రెస్ తరుఫున పోటీచేసి గెలిచి జీహెచ్ఎంసీ మేయర్ గా పనిచేశారు.
కాంగ్రెస్ నుంచి గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడ్డ కార్తీకరెడ్డి అప్పటి నుంచి హస్తం పార్టీకి దూరంగా ఉంటున్నారు. తాజాగా వచ్చే ఎన్నికల్లో సికింద్రాబాద్ టికెట్ ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే మూడు రోజుల్లో బండకార్తీక రెడ్డి బీజేపీలో చేరడానికి రెడీ అవుతున్నట్టు తెలిసింది.
జీహెచ్ఎంసీ మేయర్ పదవిని ఈసారి జనరల్ మహిళకు కేటాయించారు. దీంతో కార్తీక రెడ్డి మేయర్ పీఠం కోసమే బీజేపీలో చేరడానికి రెడీ అయినట్టుగా తెలుస్తోంది. డిసెంబర్ 1న జరిగే జీహెచ్ఎంసీ పోలింగ్ కు పార్టీలన్నీ సమాయత్తమవుతున్నాయి.