Begin typing your search above and press return to search.
పూరికి సోము వీర్రాజు ఊహించని ప్రశంస
By: Tupaki Desk | 16 Aug 2020 4:40 PM ISTదర్శకుడు పూరి జగన్నాధ్ తాజాగా తనలోని అంతరంగాన్ని ఆవిష్కరించారు. తన అభిప్రాయాలను ఆడియో రూపంలో పంచుకున్నారు. దీన్నే కొత్తగా ‘పోడ్ కాస్ట్’ అంటున్నారు. స్ఫూర్తినింపేలా మాట్లాడారు. ఈ క్లిష్టమైన సమయాల్లో పూరి జగన్నాథ్ ఉత్తేజకరమైన మాటలకు అందరూ ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.
అనేక మంది సినీ పరిశ్రమ ప్రముఖులు పూరి ఆలోచనలను.. వివిధ ముఖ్యమైన అంశాలపై ఆయన చేసిన ప్రసంగాలను బహిరంగంగా అభినందిస్తున్నారు. అయితే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తప్ప మరెవరూ పూరీని ప్రశంసిస్తూ బహిరంగంగా ట్వీట్ చేయలేదు.
ప్రస్తుతం పూరి జగన్నాథ్ మాటలకు ఫిదా అయిపోయి మరో అభిమాని ఆయన ఖాతాలో చేరిపోయారు. ఆయనే ఏపీ బీజేపీ కొత్త చీఫ్.. సినిమాలకు సంబంధం లేని వ్యక్తి సోము వీర్రాజు. తాజాగా పూరి జగన్నాథ్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా అమెరికన్ సైన్యం ఆలపించిన జనగణమన వీడియోను షేర్ చేశారు. దీనిని సోము వీరరాజు లైక్ చేశారు.
పూరి పోడ్ కాస్ట్ పై తన ఆనందాన్ని తెలియజేయడానికి సోము వీరరాజు ట్విట్టర్‌లోకి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘పూరి జగన్నాథ్ గారు నిన్న మీ పోడ్ కాస్ట్ విన్నాను. మీరు చాలా బాగా చెప్పడం జరిగింది. సమాజానికి ఉపయోగపడాలనే మీ ఆలోచన విధానం చాలా అభినందనీయం మరియు ఆదర్శప్రాయం. మీరు మరెన్నో అంశాలతో ప్రజల్లో చైతన్యం కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా..’ అంటూ పూరిని సోము వీర్రాజు పొగిడారు. తన పోడ్కాస్ట్ సిరీస్ ను కొనసాగించాలని.. ప్రజలను ఉత్తేజపరిచాలని పూరిని కోరాడు. పూరి ఆలోచనా విధానాన్ని మరియు సమాజానికి తన మార్గంలో సహాయపడటానికి అతను చేసిన ప్రయత్నాలను తాను ఇష్టపడుతున్నానని చెప్పాడు.
దీంతో సినీ ప్రముఖులనే కాదు.. పూరి పోడ్కాస్ట్ రాజకీయ నాయకులు.. రాష్ట్ర నాయకులను కూడా ఫిదా చేస్తుండడం విశేషం.