Begin typing your search above and press return to search.

హుజూరాబాద్ లో బీజేపీ మొదలెట్టింది

By:  Tupaki Desk   |   25 Jun 2021 4:19 AM GMT
హుజూరాబాద్ లో బీజేపీ మొదలెట్టింది
X
హుజూరాబాద్ పై బీజేపీ మోహరించింది. కీలక నేతలను హుజూరాబాద్ నియోజకవర్గంపై దించింది. ఇప్పుడు వారంతా ఒక్కొక్కరు ఒక్కో మండలం తీసుకొని బీజేపీ తరుఫున విస్తృత ప్రచారం మొదలుపెట్టారు. ఈటలకు మద్దతుగా లాబీయింగ్ చేస్తున్నారు. టీఆర్ఎస్ ను ఓడించడమే ధ్యేయంగా ముందుకు కదులుతున్నారు.

టీఆర్ఎస్ నుంచి బహిష్కరించినబడిన జితేందర్ రెడ్డి, దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సహా కీలక నేతలు హుజూరాబాద్ లో ఈటలకు మద్దతుగా రాజకీయం మొదలుపెట్టారు. ఈ సందర్భంగా జితేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ లేకుంటే తెలంగాణ ఉద్యమమే లేదని జితేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈటలది న్యాయ పోరాటం అని.. దానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు.

ప్రజల కోసం పోరాడే వ్యక్తి ఈటల రాజేందర్ అని.. అలాంటి మనిషి ప్రజలను, ప్రబుత్వాన్ని మోసం చేశారంటే ఎవరూ నమ్మరని అన్నారు. అసైన్డ్ భూములు కబ్జా చేశారని ఈటలను బయటకు పంపారని.. అదే టీఆర్ఎస్ లో భూకబ్జాలు చేసిన వారు చాలా మంది ఉన్నారని జితేందర్ రెడ్డి విమర్శించారు.

ఇక హుజూరాబాద్ ఉప ఎన్నిక అనగానే నియోజకవర్గాలకు వచ్చి పింఛన్లు, రేషన్ కార్డులు మమంజూరు చేస్తున్నారని.. అదే మిగతా నియోజకవర్గాల్లో ఎందుకు మంజూరు చేయడం లేదని కేసీఆర్ ను ఈటల రాజేందర్ నిలదీశారు. హుజూరాబాద్ లో బీజేపీ గెలవడం ఖాయమన్నారు.

బీజేపీ హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసం భారీగా సమాయత్తమవుతోంది. మండలాల వారీగా ఇన్ చార్జీలను నియమించింది. హుజూరాబాద్ టౌన్ ఇన్చార్జిగా దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావుకు కీలకమైన పట్టణ బాధ్యతలను అప్పగించింది. ఇక హుజూరాబాద్ రూరల్ మండలానికి రేవూరి ప్రకాష్ రెడ్డిని నియమించింది. ఇక హుజూరాబాద్ నియోజకవర్గంలోని రెండో పెద్ద పట్టణం అయిన జమ్మికుంటకు ఎంపీ అరవింద్ ను ఇన్ చార్జిగా నియమించింది. అలాగే జమ్మికుంట రూరల్ కు మాజీ ఎమ్మెల్యే ధర్మారావును నియమించింది. వీణవంక మండలానికి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డిని, ఇల్లంతకుంటకు మాజీ ఎంపీ సురేష్ రెడ్డిని, కమలాపూర్ మండలానికి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ను ఎంపిక చేసింది. ఇక ఓవరాల్ గా నియోజకవర్గాన్ని సమన్వయం చేసుకునే నియోజకవర్గ కోఆర్డినేటర్ పదవికి బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని నియమించింది.