Begin typing your search above and press return to search.

బీజేపీ సోష‌ల్ మీడియా.. బీజేపీనే డౌన్ చేస్తోందా?

By:  Tupaki Desk   |   16 May 2021 7:34 AM GMT
బీజేపీ సోష‌ల్ మీడియా.. బీజేపీనే డౌన్ చేస్తోందా?
X
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి.. సోష‌ల్ మీడియానే పెద్ద దిక్కు. రెండు సార్లు అదికారంలోకి రావ‌డా నికి.. ముఖ్యంగా గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్న న‌రేంద్ర మోదీ.. త‌ర్వాత కాలంలో జాతీయ పార్టీలో కీల‌కం గా ఎద‌గ‌డం.. దేశ ప్ర‌ధానిగా ప‌గ్గాలు చేప‌ట్ట‌డం వంటి కార‌ణాల వెనుక పార్టీ ప‌రంగా ఎంత కృషి జ‌రిగిందో తెలిసిందే. అయితే.. దీనిక‌న్నా ఎక్కువ‌గా సోష‌ల్ మీడియా మోదీని మోసింద‌నే చెప్పారు. ఆయ‌న డైలాగులు, వ‌ర్చువ‌ల్ భేటీలు... ఇలా అనేక రూపాల‌లో మోదీని ప్ర‌జ‌ల‌కు చేరువ చేసింది సోష‌ల్ మీడియా.

ఇక‌, మోడీ ప్ర‌ధానిగా ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. ట్విట్ట‌ర్ ద్వారా ప్ర‌పంచానికి చేరువ అయ్యారు. అప్ప‌టి అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌తో పోటీ ప‌డి మ‌రీ.. ట్విట్ట‌ర్‌లో వీవ‌ర్స్ ను పెంచుకున్నారు. అయితే.. ఇటీవ‌ల క‌రోనా ఎఫెక్ట్ కార‌ణంగా.. మోడీ హ‌వా స‌న్నగిల్లుతోంద‌నే వాద‌న వినిపిస్తోంది. క‌రోనా నియంత్ర‌ణ విష‌యం లోనూ ప్ర‌జల ప్రాణాలు కాపాడే విష‌యంలోనూ మోడీ పూర్తిగా విఫ‌ల‌మ‌య్యార‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోం ది. దీంతో ఏ సోష‌ల్ మీడియా అయితే.. మోడీని ఆకాశానికి ఎత్తేసిందో.. అదేసోష‌ల్ మీడియా మోదీని దుయ్య‌బ‌డుతోంది.

అయితే.. మోదీపై సోష‌ల్ మీడియాలో జ‌రుగుతున్న విమ‌ర్శ‌ల ప‌ర్వానికి ఇప్పుడు అదే బీజేపీ నిప్పులు చెరుగుతోంది. మోడీని విమ‌ర్శించేవారిపై ట్రోల్స్ పెరుగుతున్నాయి. ఎందుకంటే.. మెడిక‌ల్ జ‌ర్న‌ల్స్‌.., లాన్సెట్ పేప‌ర్ కొన్ని సూచ‌న‌లు చేయస్తున్నాయి. ఇక‌, ఇంట‌ర్నేష‌న‌ల్ జ‌ర్న‌ల్స్ కూడా మోడీ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరును ఎండ‌క‌డుతున్నాయి. దీంతో వీటిన్నంటినీ కూడా బీజేపీ సోష‌ల్ మీడియా పెద్ద ఎత్త‌న విమ‌ర్శ‌లు సంధిస్తున్న‌ది.

నిజానికి అదికారంలో ఉన్న వారికి మంచి స‌ల‌హాలు.. ఇచ్చిన‌ప్పుడు.. భ‌విష్య‌త్తును క‌ళ్ల‌ముందుకు తీసుకువ‌చ్చిన‌ప్పుడు.. వాటిని స్వీక‌రించే ల‌క్ష‌ణం.. ఉండాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కానీ, మోదీ స‌ర్కారు అలా కాకుండా వ్య‌తిరేక కోణంలో తీసుకోవ‌డం.. బీజేపీ నేత‌లు సోష‌ల్ మీడియాలోనే విమ‌ర్శ‌కుల‌ను తీవ్ర వ్యాఖ్య‌లు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. ఇలా చేయ‌డం వ‌ల్ల‌.. బీజేపీనే న‌ష్ట‌పోతుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. వచ్చే రోజుల్లో.. మ‌రిన్ని స‌వాళ్లు రాక త‌ప్ప‌ద‌ని అంటున్నారు.