Begin typing your search above and press return to search.
దేశంలో బీజేపీ 66శాతం సీట్లు ఓడిపోయింది.. ఇదిగో డీటైల్స్
By: Tupaki Desk | 1 April 2021 8:00 AM IST‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’లా తయారైంది బీజేపీ పరిస్థితి అని సోషల్ మీడియాలో లెక్కలతో సహా నెటిజన్లు, మేధావులు కడిగిపారేస్తున్నారు. పైకి జాతీయ పార్టీ కానీ.. కేవలం 6 రాష్టాల్లోనే ఆ పార్టీ ఉనికి ఉందని.. మిగతా సంకీర్ణ ప్రభుత్వాలతో మరో నాలుగు రాష్ట్రాల్లో పాలుపంచుకుందని చెబుతున్నారు. 19 రాష్ట్రాలు బీజేపీ చేజారిపోయాయని లెక్కలు చెబుతున్నాయి. బీజేపీ ఉనికి ఉన్న ఆ 10 రాష్ట్రాలు కూడా వచ్చే ఎన్నికల నాటికి చేజారిపోతే ఇక కమలం పార్టీకి గుండుసున్నానే అంటున్నారు.
తాజాగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లోనూ బీజేపీకి కేవలం ఒక్క అస్సాం, పుదుచ్చేరిలో తప్పితే మిగతా ఎక్కడా గెలుపునకు అవకాశాలే లేవు. బెంగాల్ లో గెలవదని తేలిపోయింది. పుదుచ్చేరి చిన్న కేంద్ర పాలిత ప్రాంతం. అంటే ఒక్క అసోం మాత్రమే బీజేపీకి సొంతమవుతుంది. మూడు రాష్ట్రాలు తమిళనాడు, కేరళ, బెంగాల్ చేజారిపోతాయి. ఇది ఇలాగే సాగితే బీజేపీ ఖేల్ 2024వరకు ఖతం అవుతుందని.. బీజేపీ రోజుకు దగ్గర పడ్డట్టేనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. లెక్కలతో సహా బీజేపీ శక్తి సామర్థ్యాలను సోషల్ మీడియాలో కళ్లకు కడుతున్నారు.
దేశంలోని మొత్తం 29 రాష్ట్రాలలో ఉన్న అన్ని అసెంబ్లీ స్థానాల్లోని ఎమ్మెల్యేల సంఖ్య 4,139. దేశంలోని మొత్తం 29 రాష్టాల అసెంబ్లీలలో 10 అసెంబ్లీలలో మాత్రమే బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఉంది.
*బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే లేని రాష్ట్రాలివీ-
సిక్కింలో 0 సీట్లు
మిజోరంలో 0 సీట్లు
తమిళనాడులో 0 సీట్లు.
ఆంధ్రాలో 175 స్థానాల్లో బీజేపీ-0 సీట్లు
* వివిధ రాష్ట్రాల్లో బీజేపీకి తక్కువగా ఉన్న ఎమ్మెల్యే సీట్లు
కేరళలో 140 అసెంబ్లీ స్థానాల్లో - 1 సీటు
పంజాబ్ (117)- 3
బెంగాల్ (294) -3
తెలంగాణ ( 119) - 2
ఢిల్లీ (70) - 3
ఒడిషా (147) - 10
నాగాలాండ్( 60) - 12
* సంకీర్ణ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల్లో బీజేపీ సీట్ల హోదా
మేఘాలయ రాష్ట్రంలో 60 అసెంబ్లీ సీట్లలో - 2
బీహార్‌లోని 243 లో- 53
జమ్మూ & కాశ్మీర్ 87 లో - 25
గోవాలోని 40 సీట్లలో -13 సీట్లు.
దేశంలోని మొత్తం 4139 అసెంబ్లీ స్థానాల్లో బిజెపికి 1516 సీట్లు ఉన్నాయి, అందులో 950 సీట్లు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, యూపి, ఎంపి, రాజస్థాన్ వంటి 6 రాష్ట్రాల నుంచి ఉన్నాయి. అంటే దీనర్థం.. 23 రాష్ట్రాలలో బీజేపీ ఓడిపోయిందని.. బిజెపి వాస్తవానికి దేశంలోని 66% సీట్లలో ఓడిపోయింది. దీన్ని బట్టి వచ్చేసారి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి గెలుపు అంత ఈజీకాదని.. ఖచ్చితంగా దెబ్బపడుతుందని విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే 23 రాష్ట్రాలు బీజేపీ చేతుల్లోంచి జారిపోయాయని అర్థం చేసుకోవచ్చు.. కేవలం 6 పెద్ద రాష్ట్రాల్లోనే ఆ పార్టీ బలంగా ఒంటరిగా గెలిచిందని అర్థమవుతోంది. సంకీర్ణ సర్కారులూ ఎప్పుడూ స్థిరంగా ఉండవు. దీంతో బీజేపీ బలం రోజురోజుకు తగ్గిపోతోందని తెలుస్తోంది. ఈ లెక్కన జాతీయ పార్టీ బీజేపీకి త్వరలోనే అంతిమగడియలు తథ్యం అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.