Begin typing your search above and press return to search.

టికెట్ ఇవ్వకుండా బాలీవుడ్ స్టార్ కు షాకిచ్చిన బీజేపీ

By:  Tupaki Desk   |   24 March 2021 7:30 AM GMT
టికెట్ ఇవ్వకుండా బాలీవుడ్ స్టార్ కు షాకిచ్చిన బీజేపీ
X
ఇటీవల బీజేపీలో చేరిన బాలీవుడ్ సీనియర్ నటుడు మిధున్ చక్రవర్తికి పార్టీ అధినాయకత్వం షాకిచ్చింది. తాజాగా జరుగుతున్న బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆయన సిద్దంగా ఉన్నట్లు సంకేతాలు ఇవ్వటమే కాదు.. రాస్ బిహారీ స్థానం నుంచి పోటీ చేస్తారన్న ప్రచారంభారీగా సాగింది. మంగళవారం విడుదల చేసిన తుది జాబితాలో ఆ స్థానాన్ని వేరే వారికి ఇవ్వటంతో.. మిధున్ కు మొండిచేయి చూపించినట్లేనని చెబుతున్నారు.

ఇప్పటివరకు రాస్ బిహారీ స్థానానికి బీజేపీ అభ్యర్థిని ప్రకటించకపోవటంతో.. ఆ స్థానాన్ని మిధున్ కోసం ఖాళీగా ఉంచారని భావించారు. అయితే.. అనూహ్యంగా ఆ సీటును రిటైర్డు లెఫ్టినెంట్ జనరల్ సుబ్రతా సాహాకు కేటాయించటంతో మిధున్ కు మొండియేయి చూపించినట్లైంది. దీంతో.. ఒకప్పుడు బాలీవుడ్ లో క్రేజీ హీరోగా పేరున్న మిధున్ కు తాజా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం మిస్ అయినట్లే. ఈసారికి ఆయన ఎన్నికల ప్రచారానికే పరిమితం కావాల్సి వస్తుందన్న మాట వినిపిస్తోంది.