Begin typing your search above and press return to search.

ఎన్నికల వేల బీజేపీకి షాక్ మమత కి జై కొట్టిన సీనియర్ బీజేపీ నేత !

By:  Tupaki Desk   |   13 March 2021 2:30 PM GMT
ఎన్నికల వేల బీజేపీకి షాక్ మమత కి జై కొట్టిన సీనియర్ బీజేపీ నేత !
X
దేశంలో జరుగుతున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కాకరేపుతున్నాయి. ఈ ఎన్నికల్లో ఐదు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి , లేక బీజేపీ మద్దతు ఇస్తున్న పార్టీలు అధికారంలోకి రావడానికి తీవ్ర స్థాయిలో ప్రయత్నం చేస్తున్నాయి. ఇక పశ్చిమ బెంగాల్ లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. బెంగాల్ లో ఈ ఎన్నికలు అగ్ని పరీక్షలా మారాయి. మరోసారి అధికారంలోకి రావడానికి తృణముల్‌ కాంగ్రెస్‌ పార్టీ(టీఎంసీ) విశ్వప్రయత్నాలు చేస్తుంటే ..మరోవైపు బీజేపీ ఈసారి మమతా బెనర్జీ కంచు కోట బద్దలు కొట్టాలని చూస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీల మధ్య మాటలు కోటలు దాటుతున్నాయి. విమర్శలకు ప్రతివిమర్శలు, రాజకీయ వ్యూహాలతో బెంగాల్ అట్టుడికిపోతోంది.

ఈ ఎన్నికల నేపథ్యంలోనే బీజేపీ మాజీ సినియర్ నేత మమతా బెనర్జీ కి జై కొడుతూ టీఎంసీలో చేరడం గమనార్హం. బీజేపీ మాజీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రజలంతా మమతా బెనర్జీకి అండగా ఉండాల్సిన తరుణం ఆసన్నమయిందని , కలకత్తాలోని టీఎంసీ భవన్ కు స్వయంగా వెళ్లి మరీ యశ్వంత్ సిన్హా ఆ పార్టీలో చేరారు. భారతదేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు ఇవి అనీ, బెంగాల్ ప్రజలు దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికల్లో ఓటు వేయబోతున్నారని ఆయన అభివర్ణించారు. అకాళీదల్ పోయింది, బీజేడీ కూడా వదిలేసింది.

ఇప్పుడు బీజేపీతో ఎవరు కలిసి ఉన్నారు. ఒక్కో పార్టీ బీజేపీని వదిలేస్తూ వస్తోంది. బీజేపీ పాలనలో చివరకు న్యాయశాఖ కూడా ప్రమాదంలో పడింది. అని యశ్వంత్ సిన్హా వ్యాఖ్యానించారు. రైతుల ఆందోళనలను కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. ఇక యశ్వంత్‌ సిన్హా మాజీ ప్రధాని వాజ్‌పేయి హయాంలో ఆర్థికమంత్రిగా పనిచేసిన విషయం తెలిసిందే. అలాగే మమతాబెనర్జీ కూడా వాజ్‌పేయి హయాంలో కేంద్రమంత్రిగా పనిచేశారు.