Begin typing your search above and press return to search.

బీజేపీ ఇసుక సత్యాగ్రహం.. జనాలు పట్టించుకుంటారా?

By:  Tupaki Desk   |   4 Nov 2019 2:30 PM GMT
బీజేపీ ఇసుక సత్యాగ్రహం.. జనాలు పట్టించుకుంటారా?
X
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తను చేయాల్సిన పనులు చేయకుండా, అర్థం లేని పనులు అన్నీ చేస్తోంది. రాష్ట్రానికి ఇచ్చిన హామీల అమలులో భారతీయ జనతా పార్టీ ఏ మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు. ఏపీలో బలపడిపోవాలని కలలు కంటూ కూడా భారతీయ జనతా పార్టీ ఏపీ బాగోగుల గురించి పట్టించుకోవడం లేదు.

ప్రత్యేకహోదా ఆకాంక్షకు విలును ఇవ్వలేదు. వెనుకబడిన జిల్లాల నిధుల్లేవు. విభజన హామీల అమలూ లేదు! ఇలాంటి పరిణామాల్లో బీజేపీ రాజకీయాలు మాత్రం గట్టిగానే చేస్తూ ఉంది.
ఏపీలో బలోపేతం లక్ష్యంగా కమలం పార్టీ కొత్త కొత్త ప్లాన్లేవో వేస్తోంది. అందులో భాగంగా ‘ఇసుక సత్యాగ్రహం’ ను చేపడుతోందట కమలం పార్టీ. ఇసుక కొరత తప్ప ఇప్పుడు రాజకీయపార్టీలకు మరో అజెండా లేకుండాపోయింది. బీజేపీ కూడా అందుకు మినహాయింపులా కనిపించడం లేదు.

అయితే బీజేపీని జనాలు పట్టించుకుంటారా? అనేదే ప్రశ్న. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తన చేతిలోని అంశాలున పరిష్కరించడం లేదు. ఏపీని ఉద్ధరించింది ఏమీ లేదు. అయితే ఇలాంటి రాజకీయాన్ని మాత్రం చేయాలని చూస్తోంది. కమలం పార్టీలోకి ఇటీవల కొన్ని చేరికలు జరిగాయి. అవన్నీ తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో జరిగినవే.

వాటిని చూసుకుని బీజేపీ చాలా హడావుడి చేయాలని చూస్తోంది. అయితే బీజేపీ మీద ఏపీ జనాల్లో ఇప్పుడు ఎలాంటి సానుకూలతా లేదు. ఇలాంటప్పుడు ఆ పార్టీ చేసే సత్యాగ్రహాలను మాత్రం ప్రజలు పట్టించుకుంటారా? లైట్ తీసుకోక!