Begin typing your search above and press return to search.

దేశమంతా నో.. సొంత రాష్ట్రంలో పెట్రోల్ తగ్గించిన బీజేపీ

By:  Tupaki Desk   |   13 Feb 2021 8:00 AM IST
దేశమంతా నో.. సొంత రాష్ట్రంలో పెట్రోల్ తగ్గించిన బీజేపీ
X
దేశవ్యాప్తంగా పెట్రోల్ ధర రూ.100కు చేరువ అవుతోంది. పెంచడమే తప్ప తగ్గించడం మోడీ సార్ చేయడం లేదు. అయితే ఈ ధరాఘాతంతో ప్రజలంతా హాహాకారాలు చేస్తున్నారు. అయినా మోడీ సార్ కనికరించడం లేదు. తగ్గించడం లేదు. అయితే ఆ బీజేపీ పాలిత రాష్ట్రంలో మాత్రం బీజేపీ సీఎం ప్రజలను కనికరించాడు. పోనీలే బతకండి అంటూ ఓ రూ.5 రూపాయాలు పెట్రోల్ ధరలు తగ్గించాడు. అదే బీజేపీ నేతలు దేశమంతా చేస్తే ప్రజలకు ఊరటనిచ్చే వారు అవుతారు కదా అని మిగతా రాష్ట్రాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

పెట్రో ధరలు భగ్గుమంటున్న వేళ బీజేపీ పాలిత అసోం రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పెట్రోలుపై లీటర్ కు రూ.5 రూపాయలు తగ్గిస్తూ అక్కడి బీజేపీ సర్కార్ వాహనదారులకు భారీ ఊరటనిచ్చింది.అలాగే మద్యంపై సుంకాన్ని 25శాతం తగ్గించినట్లు అసోం ప్రభుత్వం శుక్రవారం వెల్లడించింది.

కోవిడ్-19 లాక్ డౌన్ నేపథ్యంలో దేశంలోని కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై పడి ప్రధానంగా పెట్రోల్, డీజిల్, మద్యంపై అదనపు సెస్ విధించి దోచుకుంటున్నాయి. కానీ ఇప్పుడు కరోనా తగ్గినా ఈ దోపిడీ ఆగడం లేదు.

ఎక్కడో బీజేపీ సీఎం కనికరించి తగ్గించాడు. కానీ ఈ కనికరం మన తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ లకు లేదు. ఇక మోడీ సార్ కు అంతకంటే లేదు. తన పాలనలో పెంచుడే తప్పితే తగ్గించుడు అన్న మాటనే మోడీసార్ మరిచిపోయి చాలా కాలమైంది. సో బీజేపీ పాలిత ఒక్క రాష్ట్రంలో తీసుకున్న నిర్ణయాన్ని అదే బీజేపీ దేశమంతా తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కానీ ఇలాంటి పప్పులు మోడీ సార్ దగ్గర ఉడకవు. సో పెట్రోల్ భారం భరించక తప్పదు.