Begin typing your search above and press return to search.

పవన్ ను సాంతం వాడేయడానికి బీజేపీ రెడీ!

By:  Tupaki Desk   |   17 Jan 2020 10:41 AM IST
పవన్ ను సాంతం వాడేయడానికి బీజేపీ రెడీ!
X
కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ పార్టీ. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తీసికట్టుగానే మారిపోయింది. ఏపీలో నాయకుల చప్పుడు బాగానే ఉన్నా ఆ చప్పుడుకు తగ్గ విజయాలు మాత్రం అందుకోవడం లేదు. ఇక తెలంగాణలో మోడీ బొమ్మ చూసి ఓ నాలుగు ఎంపీ సీట్లు దక్కించుకుంది. తర్వాత శరామామూలే..

అందుకే రాజకీయ భవిష్యత్ కోసం అవసరార్థం తమతో కలిసిన జనసేనాని పవన్ కళ్యాణ్ ను సాంతం వాడేయడానికి కేంద్రంలోని బీజేపీ పెద్దలు రెడీ అయ్యారట.. పవన్ కళ్యాణ్ ఇప్పుడు యూత్ ఐకాన్. ఆయనకు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా తెలుగోళ్లలో పిచ్చ క్రేజ్. కోట్ల మంది అభిమానులున్నారు. అందుకే ఎరక్కపోయి తమకు ఇరుక్కుపోయిన పవన్ ను రాజకీయంగా వాడుకోవడానికి బీజేపీ రెడీ అయ్యిందట..

టాప్ హీరో - లక్షలాది అభిమానులు - బీజేపీ-జనసేన క్యాడర్ ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ కు కొత్త బాధ్యతలు అప్పజెప్పడానికి బీజేపీ రెడీ అయ్యిందట..ఈ మేరకు రూట్ మ్యాప్ ను రెడీ చేస్తోందట..

దేశంలో పౌరసత్వ సవరణ మంటలు ఆరడం లేదు. బీజేపీ కొలువుదీరిన కర్ణాటకలో అయితే ఇంకా చల్లారడం లేదు. అందుకే నిన్న పౌరసత్వ సవరణ చట్టానికి అనుకూలంగా మాట్లాడిన పవన్ తో కర్ణాటకలో పర్యటింప చేసి పౌరసత్వంపై ర్యాలీలు - ప్రచారం చేయించాలని కమలనాథులు రూట్ మ్యాప్ రెడీ చేశారట.. ఇక తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లోనూ బీజేపీ అభ్యర్థుల తరుఫున ప్రచారం చేయడానికి పవన్ ను వాడుకోవడానికి సిద్ధమయ్యారట.. ఇలా కమలనాథులు పొత్తుకోసం వచ్చిన పవన్ ను సాంతం వాడేయడానికి రెడీ అయ్యారని సమాచారం.