Begin typing your search above and press return to search.

ఎంఐఎంకు హోదా.. బీజేపీ సీరియస్

By:  Tupaki Desk   |   13 Jun 2019 7:10 AM GMT
ఎంఐఎంకు హోదా.. బీజేపీ సీరియస్
X
మిత్రపక్షానికి ప్రతిపక్ష హోదా ఇవ్వడమంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్-ఎంఐఎం మిత్రపక్షంగా పోటీచేశాయని.. ఇప్పుడు ఎంఐఎంకు ప్రతిపక్ష పార్టీ హోదాను అసెంబ్లీలో ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్షాన్ని విలీనం చేసి టీఆర్ ఎస్ పెద్ద తప్పు చేసిందని.. రాజ్యాంగంలోని లొసుగులను అడ్డం పెట్టుకొని ఇలా చేయడం దారుణమని లక్ష్మణ్ మండిపడ్డారు.

తెలంగాణలో టీఆర్ ఎస్ కు ప్రత్యామ్మాయ పార్టీ బీజేపీనేనని.. వచ్చే ఐదేళ్లలో తెలంగాణలో టీఆర్ ఎస్ కు బుద్దిచెప్పే పార్టీగా బీజేపీ ఎదుగుతుందని లక్ష్మణ్ ధీమా వ్యక్తం చేశారు.కర్ణాటక తర్వాత బీజేపీకి అనుకూలంగా ఉన్న రాష్ట్రం తెలంగాణే అని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే బీజేపీ అధిష్టానం తెలంగాణపై దృష్టి సారించిందని. మోడీ అండదండలతో తెలంగాణలో సత్తా చాటుతామన్నారు.

త్వరలోనే కేసీఆర్ ప్రజావ్యతిరేక పాలనపై తెలంగాణలో ఉద్యమాలు చేస్తామని లక్ష్మణ్ సంచలన కామెంట్స్ చేశారు. వచ్చేఐదేళ్లలో తెలంగాణలో అధికారంలోకి రావడమే బీజేపీ లక్ష్యమన్నారు.

విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించిన కేసీఆర్ ఫీజుల నియంత్రణపై ఏవిధమైన నిర్ణయం తీసుకోకుండా ప్రైవేటు విద్యాసంస్థలకు లాభం చేకూరుస్తుందని లక్ష్మణ్ మండిపడ్డారు. పరీక్షల్లో అన్నీ అవకతవకలేనని మండిపడ్డారు. దేశంలోనే పార్టీ ఫిరాయింపుల్లో టీఆర్ఎస్ ది నంబర్ 1 స్థానం అని లక్ష్మణ్ మండిపడ్డారు. ఎంఐఎంకు ప్రతిపక్ష హోదా ఇస్తే బీజేపీ ఊరుకోదని హెచ్చరించారు.