Begin typing your search above and press return to search.

ఏపీలో బీజేపీ కాయ్ రాజా కాయ్ రాజా!

By:  Tupaki Desk   |   1 Sep 2022 10:30 AM GMT
ఏపీలో బీజేపీ కాయ్ రాజా కాయ్ రాజా!
X
ఏపీలో బీజేపీ కాయ్ రాజా కాయ్ రాజా అంటోంది. దీని అర్ధం పరమార్ధం ఏంటి అంటే ఏ పార్టీ తమకు ఎక్కువ సీట్లు వచ్చే ఎన్నికల్లో పొత్తు రూపేణా ఇస్తే వారితోనే ఉండేందుకు మొగ్గు చూపిస్తుందిట. బీజేపీ ఆశ ఎలా ఉంది అంటే వచ్చే ఎన్నికల్లో ఏపీలో ముప్పై సీట్లు బీజేపీకి పొత్తుల ద్వారా ఇవ్వాలంట‌. అలా ఇచ్చిన పార్టీ వైపే బీజేపీ ఉటుందంట.

చిత్రమేంటి అంటే ఏపీలో బీజేపీకి .05 ఓట్లు మాత్రమే 2019 ఎన్నికల్లో వచ్చాయి. ఎక్కడా ఒక్క చోట కూడా డిపాజిట్లు రాలేదు. అలాంటి పార్టీ మూడేళ్లలో కూడా ఎత్తిగిల్లినది లేదు. పెద్దగా పెర్ఫార్మ్ చేసినదీ లేదు. కానీ 2024 ఎన్నికలలో ఏపీలో మాత్రం 30 సీట్లకు పోటీ చేయాలని ఆశపడుతోంది. మరి బీజేపీ ఈ విధంగా డిమాండ్ చేస్తోంది అంటే దాని వెనక చాలానే కధ ఉంది అంటున్నారు.

వచ్చే ఎన్నికల్లో ప్రధాన పార్టీలు డబ్బులు పంచాలీ అంటే వివిధ కీలక డిపార్ట్స్మెంట్స్ అన్నీ కలసిరావాల్సి ఉంది అంటున్నారు. ఆయా వ్యవస్థలు బీజేపీ చేతిలో ఉండడమే కమలనాధులకు ఇపుడు అతి పెద్ద వరంగా మారుతోంది. అంటే తాము ఓకే అని చెప్పే పార్టీలకు వచ్చే ఎన్నికల్లో పలు డిపార్ట్మెంట్స్ తో సహా కీలక వ్యవస్థల నుంచి ఏ రకమైన ఇబ్బందులు ఉండకుండా ఉండాలంటే బీజేపీకి మొక్కుకోవాలి. అంతే కాదు ఆ పార్టీ మొక్కులు కూడా చెల్లించాలి.

ఇదన్న మాట అసలు రాజకీయ నీతి. అసలు రాజకీయ బేరం. ఇలా బీజేపీ కొండెక్కి పోయి బేరాలు పెడుతోంది అంటే ఏపీలోని ప్రధాన పార్టీల వీక్ నెస్ కూడా బాగా అర్ధమైపోయినందువల్లనే అంటున్నారు. ఇక ఏపీలో ఇప్పటికే బీజేపీ పొత్తు కోసం ఆరాటపడుతున్న టీడీపీకి కూడా బీజేపీ అల్లరి పెట్టడానికి ఎక్కువ సీట్ల డిమాండే కారణం అంటున్నారు. టీడీపీ ఎక్కువ సీట్లు ఇస్తే కచ్చితంగా తమ సపోర్టు ఆ పార్టీకే ఉంటుంది అని చెబుతారన్న మాట.

ఇక ఇప్పటికైతే ఊహాజనితంగా ఉన్న వైసీపీతో బీజేపీ పొత్తు అన్నది రేపు కనుక అనూహ్యమైన పరిణామాలు జరిగి మెటీరియలైజ్ అయితే వైసీపీ ఎక్కువ సీట్లు బీజేపీకి తాము ఇస్తామని ముందుకు వస్తే అపుడు ఏం జరుగుతుందో చూడాలి. ఒక విధంగా వైసీపీని కిందకు లాగాలని తమ వైపునకు తిప్పుకోవాలని బీజేపీ టీడీపీతో పొత్తు అని మైండ్ గేమ్ ఆడుతోంది అని కూడా అంటున్నారుట.

అంటే వైసీపీ కనుక పొత్తులకు ఆ మీదట ముప్పయి దాకా సీట్లు ఇవ్వడానికి దిగిరాకపోతే టీడీపీతో పొత్తులకు తాము రెడీ అవుతామని చెప్పాలని బీజేపీ నేతల మధ్య పెద్ద ఎత్తున చర్చ సాగుతోందిట. మొత్తానికి చూస్తే బీజేపీ రాజకీయ తెలివిడి అందరినీ మించి పోయింది అనే అంటున్నారు. తమతో చెలిమి కోసం అంగలారుస్తున్న రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలను ఆటపట్టిస్తూ వారి భుజాల మీద ఎక్కి తన పబ్బం గడుపుకోవడానికి బీజేపీ ఏమైనా చేస్తుంది అని అంటున్నారు.

అందుకోసం తమ చేతిలో ఉన్న వ్యవస్థలను కూడా యధేచ్చగా వాడుకోవడానికి కూడా సిద్ధపడుతుంది అని కూడా అంటున్నారు. ఇది నిజంగా జరిగితే మాత్రం బీజేపీ కి ఉన్న తేడా కలిగిన పార్టీ అన్న ముద్రకు వేరే అర్ధాలు చెప్పుకోవాలేమో. ఒకనాడు వాజ్ పేయ్ అద్వానీ వంటి ప్రముఖులు తీర్చిదిద్దిన బీజేపీ ఈ రకంగా చేయడం అంటే ఆ పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టి ఫక్తు రాజకీయం చేయడం కోసం తెలుగు రాష్ట్రాలలో పాల్పడుతున్న ఎత్తులు చూస్తే ఏమనుకోవాలో తెలియడం లేదు అన్న వారూ ఉన్నారు.

ఏది ఏమైనా బీజేపీ కావచ్చు మరో పార్టీ కావచ్చు వీక్ నెస్ ఎక్కడ ఉంటే అక్కడే రాజకీయం చేయడానికి చూస్తారు. ఇది రాజకీయం అయినపుడు ఆ ఆట అలాగే ఆడాలని, నీతి నియమాలు పెట్టుకోరాదు అని భావించినపుడు ఇలాగే కధ ఉంటుంది. మరి బీజేపీ మైండ్ గేమ్ లో ఏపీలో ఏ రాజకీయ పార్టీ పడుతుందో చూడాల్సిందే.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.