Begin typing your search above and press return to search.

రెడ్డి గారే బలవంతుడట... కమలనాధులూ లైట్ తీస్కోండి

By:  Tupaki Desk   |   5 Sep 2022 7:43 AM GMT
రెడ్డి గారే బలవంతుడట... కమలనాధులూ లైట్ తీస్కోండి
X
బలం ఎపుడూ వ్యక్తి నుంచి వ్యవస్థకు సంస్థకు వస్తుంది. కొన్ని సార్లు వ్యక్తులే సంస్థలుగా మారుతారు. అలాంటి వారికి ఇండివిడ్యువల్ గా ఆదరణ ఎపుడూ  ఉంటుంది. అపుడు వారు ఆయా సంస్థల కంటే కూడా ఎక్కువ అవుతారు. బీజేపీలో ఇపుడు అలాంటి సీనే కనిపిస్తోంది. తొందరలో జరగబోయే మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కోరి మరీ పోటీ తెచ్చుకున్నారు. తీరా చూస్తే ఆయన దూకిన పార్టీ బీజేపీకి ఏనాడూ పెద్దగా ఓట్లు వచ్చినది లేదు.

బీజేపీ ఎపుడూ మునుగోడులో ఓడిపోయే పార్టీనే. అలాంటి పార్టీ రధమెక్కి యుద్ధం చేస్తున్న రాజగోపాల్ రెడ్డికి మెల్లగా సీన్ అర్ధమవుతోంది. బీజేపీకి అక్కడ ఏ కోశానా  పట్టు లేదని ఆయనకు ముందే తెలిసినా ఇపుడు ప్రత్యర్ధుల నుంచి ఎదురవుతున్న గట్టి పోటీ వస్తున్న సర్వేలు అవి ఇస్తున్న షాకులను చూసిన మీదట తత్వం బాగా బోధపడింది. దాంతో ఆయన మునుగోడులో పోటీ అన్నది కాంగ్రెస్ టీయారెస్ తో చేస్తున్నది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రమే అని చెబుతున్నారు.

తానే ఒక వ్యవస్థను అంటున్నారు. జనాలు తనను చూసి ఓట్లు వేస్తారు అని ధీమాగా చెబుతున్నారు. తాను ఇండిపెండెంట్ గా నిలబడినా గెలవగలను అని సవాల్ చేస్తున్నారు. మరి ఇంతలా కమలం పార్టీని లైట్ తీసుకుంటున్న రాజగోపాల్ రెడ్డి పోకడలను చూసి ప్రత్యర్దులు ఎలా రియాక్ట్ అవుతున్నా ఆయన్ని తమ పార్టీలోకి చేర్చుకున్న కమలనాధులు మాత్రం అతి పెద్ద షాక్ తింటున్నారు.

మునుగోడులో రాజగోపాల్ రెడ్డి  తోనే పోటీ అని ఆయన చెప్పడాన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. తాను పార్టీ కంటే ఎక్కువ అన్నట్లుగా ఆయన మాట్లాడడాన్ని వారు తట్టుకోలేకపోతున్నారు. బీజేపీ అని చెబితే ఓట్లు రావు అన్నది అర్ధమయ్యే ఆయన ఇల ప్లేట్ ఫిరాయించారని అంటున్నారు. ఇక ఆయనకు కాంగ్రెస్ లో ఉన్న పలుకుబడితో తన బలమైన అనుచరగణంతో ఈ ఎన్నికను గెలవాలని చూస్తున్నారు.

రాజగోపాల్ రెడ్డి అనుచరులకు ఎవరికీ బీజేపీ అంటే ఇష్టంలేనట్లుగా కనబడుతోంది. దాంతో పాటు మునుగోడు చైతన్యం కలిగిన ప్రాంతం, ఇక్కడ నుంచి కమ్యూనిస్టులు కూడా గెలిచారు. దాంతో బీజేపీ అంటే అక్కడ జనాలకు పెద్దగా తెలియదు అని కూడా అనుకోవాలి. ఇలాంటి లెక్కలు అంచనాలు వేసుకున్న రాజ గోపాల్ రెడ్డి తన సొంత బలంతో గెలవాలని చూస్తున్నారు.

అందుకే ఆయన తాను ఇండిపెండెంట్ అని కూడా చెప్పుకుంటున్నారు. ఆ విధంగా కాంగ్రెస్ లో  ఉన్న తన అనుచరులను తన వైపుగా తిప్పుకుంటున్నారు. అయితే ఆయన స్ట్రాటజీ ఎలా ఉన్నా ఆయన్ని తెచ్చి నెత్తి మీద పెట్టుకున్న కమలనాధులు మాత్రం ఈ లాజికి ని అర్ధం చేసుకోలేకపోతున్నారు. పార్టీ కంటే తానే బలవంతుడిని అని ఆయన చెప్పడాన్ని కూడా వారు సమర్ధించుకోలేకపోతున్నారు.

ఇదిలా ఉంటే ఇంతకు ముందు దుబ్బాకలో బీజేపీ గెలిచినా అక్కడ రఘునందం వ్యక్తిగత ఇమేజ్ మీదనే ఆధారపడి అన్నది బీజేపీ ఎప్పటికీ ఒప్పుకోదు, అలాగే హుజూరాబాద్ లో ఈటెల రాజెందర్ విజయం కూడా ఆయన సొంత గెలుపు అన్న్నా కమలనాధులు పట్టించుకోరు. ఇపుడు చిత్రమేంటి అంటే వాటి కంటే ఎక్కువగా ఇంకా ఎన్నిక జరగకుండానే అంతా నా వల్లే అంటూ రాజగోపాల్ రెడ్డి చేస్తున్న బిగ్ సౌండ్స్ మాత్రం కమలానికి కలవరం కలిగిస్తున్నాయి.

అయినా పక్కాగా రాజకీయ విశ్లేషణ చేయాలంటే బీజేపీకి ఆయా సీట్లలో పూర్వం బలమేముంది. ఇపుడు అక్కడ బలమైన నాయకులు లు వల్లనే కదా అన్నేసి ఓట్లు వస్తున్నాయి. విజయాలు దక్కుతున్నాయి. అంటే అవి బీజేపీ విజయాలు కావు అని అంతా అంటారు. ఒక్క బీజేపీ తప్ప.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.