Begin typing your search above and press return to search.
మోడీ రోడ్ షో...వైసీపీకి షాక్ ఇచ్చేలా...
By: Tupaki Desk | 6 Nov 2022 8:00 AM ISTప్రధాని నరేంద్ర మోడీ విశాఖ రావడం కాదు కానీ ఏపీ బీజేపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా పొలిటికల్ సీన్ తయారైంది. మోడీ మావాడు, మా పార్టీ మనిషి. మధ్యలో మీకెందుకు అంటూ అపుడే వైసీపీ మీద దండెత్తిన కమలనాధులు మోడీ సభకు విశాఖ టూర్ ని మొత్తం వైసీపీ హై జాక్ చేయడం చూసి ఇక లాభం లేదనుకుని రంగంలోకి దిగిపోయారు.
దీని కోసం బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, సోము వీరాజు సహా కీలక నేతలు విశాఖలో మకాం వేశారు. రాక రాక విశాఖ వస్తున్న మోడీ సార్ ని గ్రాండ్ లెవెల్ లో వెల్ కం చెబుదామని బీజేపీ నేతలు నిర్ణయించారు. అంతే కాదు మోడీ ఈ నెల 11న విశాఖ వస్తున్నకు భారీ ఎత్తున పార్టీ శ్రేణులు వెళ్ళి స్వాగతం పలకాలని కూడా డిసైడ్ అయ్యారు.
ఇక 12న మోడీ నేవీ గెస్ట్ హౌస్ నుంచి ఏయూ సభ వరకూ వచ్చే దారి మొత్తానికి సంబంధించి భారీ రోడ్ షోని చేయడానికి కూడా రెడీ అయిపోతున్నారు. కచ్చితంగా ఇది పది కిలోమీటర్లకు పైగా దూరం ఉంటుంది. మరి ఇంత దూరం రోడ్ షో మోడీది చేయాలని బీజేపీ నేతలు సిద్ధం కావడం విశేషమే.
ఏకంగా ఉత్తరాంధ్రాలోని పార్టీ యంత్రాంగాన్ని తీసుకురావడం ద్వారా మోడీకి బీజేపీ బలమేంటో చూపించాలని కూడా భావిస్తున్నారు. అలాగే మోడీ టూర్ అంతా తనదే అని పెత్తనం చేస్తున్న వైసీపీకి గట్టి ఝలక్ ఇవ్వాలని కూడా చూస్తున్నారుట. దారి వెంబడి ఉత్తరాంధ్రా కళా ప్రదర్శనలు తప్పెటగుళ్ళు వంటి వాటితో మోడీ వద్ద మార్కులు కొట్టేయడానికి బీజేపీ నేతలు తాపత్రయపడుతున్నారు.
అంతా బాగానే ఉంది. మోడీ సభకు జనామీకరణ కూడా తామే చేస్తామని అంటున్నారు. ఏకంగా మూడు లక్షల మందిని తెస్తామని బీజేపీ బీరాలు పోతోంది. నిజానికి ఏయూ ప్రాంగణం అంటే లక్ష మందికి అటూ ఇటూగా పడతారు. మూడు లక్షలు అంటే ప్రాంగణమే సరిపోదు. కానీ బీజేపీ నాయకుల మాటలు అయితే కోటలు దాటేస్తున్నాయి. మరి ఇంతమంది జనాలు బీజేపీకి నిజంగా ఉన్నారా. సమీకరణ చేయగలదా అలా కనుక చేస్తే బీజేపీ విశాఖలో ఈజీగా గెలవడం ఖాయం.
కానీ వైసీపీ మీద కసితో పోటీగా బీజేపీ ఇపుడు జూలు విదిలిస్తోంది. కేవలం సీఎం మంత్రులు జస్ట్ అలా అధికారిక కార్యక్రమంగా వచ్చి వేదిక మీద కూర్చుని వెళ్ళిపోవాల్సిందే మొత్తం అంతా మాదే మేమే అని బీజేపీ హడావుడి చేస్తోంది. అయితే వైసీపీ కూడా ఏమీ తక్కువ తినడం లేదు. సభలో లక్ష మంది జనాలు తమ వంతు అంటోంది. చూడాలి మరి ఈ పోటీతో మోడీ సభను, విశాఖ టూర్ ని ఏ విధంగా సక్సెస్ చేస్తారో మరి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.