Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ బీజేపీకి ఎంత లైట్ అయ్యాడా....!

By:  Tupaki Desk   |   30 Oct 2019 10:35 PM IST
ప‌వ‌న్ బీజేపీకి ఎంత లైట్ అయ్యాడా....!
X
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ కు ఏపీ బీజేపీ అదిరిపోయే షాక్ ఇచ్చింది. ఏపీలో ప్ర‌స్తుతం ఇసుక కొర‌త తీవ్రంగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌న్ భవన నిర్మాణ కార్మికుల కోరిక మేరకు ఇసుక సమస్య పరిష్కారంలో అన్ని రాజకీయ పార్టీలను కలుపుకుని ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ‌తాన‌ని ప‌వ‌న్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ న‌వంబ‌ర్ 3వ తేదీన విశాఖ‌ప‌ట్నంలో లాంగ్ మార్చ్ తలపెట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ విష‌యమై ప‌వ‌న్ ఇప్ప‌టికే అన్ని పార్టీల నాయ‌కుల‌తో ఫోన్ లో మాట్లాడార‌ని కూడా తెలిపింది.

జ‌న‌సేన అయితే ముందుగా చంద్ర‌బాబుతో పాటు ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు కన్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌తో కూడా ప‌వ‌న్ మాట్లాడార‌ని... వారంద‌రిని క‌లుపుకుని ఈ పోరాటం చేస్తాడ‌ని తెలిపింది. జ‌న‌సేన ఆశ‌లు ఇలా ఉంటే వీటిపై ఏపీ బీజేపీ నీళ్లు కుమ్మ‌రించేసింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌భ‌లో పాల్గొనాల్సిన అవ‌స‌రం ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణకు లేద‌ని... ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్‌ రెడ్డి అన్నారు.

ఇసుక కొర‌త ప‌రిష్క‌రించాల‌ని ముందుగా సీఎం జ‌గ‌న్‌ కు లేఖ రాసింది బీజేపీయే అన్న విష‌యం ఆయ‌న తెలిపారు. దీనిపై త‌మ పార్టీయే గ‌వ‌ర్న‌ర్‌ కు విన‌తిప‌త్రం ఇచ్చింద‌ని... దీనిపై న‌వంబ‌ర్ 4న విజ‌య‌వాడ‌లో త‌మ పార్టీ భారీ ఎత్తున నిర‌స‌న‌కు దిగుతున్న‌ట్టు ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఏదేమైనా ప‌వ‌న్ ప్ర‌స్తుతం ఏపీలో సామాన్య జ‌నాల‌ను తీవ్రంగా కుదిపేస్తోన్న ఇసుక కొర‌త అంశం తీసుకుని రాజ‌కీయంగా హైలెట్ అవ్వాల‌నుకుని వేసిన ప్లాన్‌ కు బీజేపీ ఆదిలోనే బ్రేక్ వేసింది.

ఇక ఇదే టైంలో ప‌వ‌న్ చంద్ర‌బాబుతో ఫోన్ లో మాట్లాడిన‌ప్పుడు చంద్ర‌బాబు నుంచి త‌మ‌కు మ‌ద్ద‌తు ఇచ్చే విష‌యంలో సానుకూలత వ‌చ్చింద‌ని కూడా జ‌న‌సేన నేత‌లు చెప్పుకుంటున్నారు. మ‌రి ఫైన‌ల్‌ గా లాంగ్ మార్చ్ టైంకు బాబు మాట మీద నిల‌బ‌డ‌తారా ? లేదా ? ఆయ‌న కూడా హ్యాండ్ ఇస్తారా ? అన్న‌ది చూడాలి. ఇక ఇదే రోజు బీజేపీ జాతీయ సమన్వయకర్త పురిహెళ్ల రఘురాం మాట్లాడుతూ జనసేన ఒక గందరగోళ పార్టీ అని విమ‌ర్శించారు.