Begin typing your search above and press return to search.

గ్రేటర్ పీఠం కోసం బీజేపీ భారీ ప్లానింగ్.. ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తున్నారుగా?

By:  Tupaki Desk   |   16 Nov 2020 11:00 AM IST
గ్రేటర్ పీఠం కోసం బీజేపీ భారీ ప్లానింగ్.. ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తున్నారుగా?
X
దుబ్బాక ఉప ఎన్నిక ఫలితం సంచలనంగా మారటమే కాదు.. బీజేపీకి కొత్త ఆశలు చిగురించేలా చేసింది. కష్టపడాలే కానీ.. ఫలితం దక్కుతుందన్న ఆశను పెంచింది. దుబ్బాక ఉప ఎన్నిక ఎదురుదెబ్బను గ్రేటర్ ఎన్నికల ద్వారా అధిగమించాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వేసిన ప్లాన్ కు తనదైన శైలిలో చెక్ పెట్టేందుకు సిద్ధమవుతోంది బీజేపీ. ఇందుకోసం పెద్ద ఎత్తున నేతల్ని గ్రేటర్ లో మొహరించేలా చేయటమే కాదు.. వారి మార్గదర్శనంలో గ్రేటర్ పోరులో తలపడేందుకు తయారవుతోంది.

గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ ఇవాళ.. రేపో అన్నట్లుగా ఉంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకొన్న నేపథ్యంలో నోటిఫికేషన్ జారీ లాంఛనమే తప్పించి మరింకేమీ కాదని చెప్పాలి. ఈ పోరులోఅధికార టీఆర్ఎస్ కు గట్టి సవాలు విసరటానికి వీలుగా.. వివిధ రాష్ట్రాలకు చెందిన పలువురు బీజేపీ నేతల్ని గ్రేటర్ పీఠం కోసం హైదరాబాద్ కు దించుతున్నారు.

జీహెచ్ఎంసీ పరిధిలో పార్టీకి నూత ఇన్ ఛార్జిలీను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం బీజేపీ జాతీయ కార్యదర్శి భూపేంద్ర యాదవ్ ను గ్రేటర్ ఎన్నికల ప్రధాన ఇన్ చార్జిగా నియమించారు. వీరితో పాటు భారీ టీంను సిద్ధం చేశారు. ఇందులో మహారాష్ట్రకు చెందిన ఆశిష్ శెల్లార్.. గుజరాత్ కు చెందిన ప్రదీప్ సింహ్.. కర్ణాటకకుచెందిన సతీశ్ రెడ్డిలు ఉన్నారు. ఇదంతా చూస్తుంటే.. గ్రేటర్ ఎన్నికల్ని బీజేపీ ఎంత సీరియస్ గా తీసుకుందన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు.