Begin typing your search above and press return to search.
గాంధీ పై సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ !
By: Tupaki Desk | 3 Feb 2020 11:52 AM ISTజాతిపిత మహాత్మాగాంధీ పై కేంద్ర మాజీమంత్రి , బీజేపీ ఎంపీ అనంత కుమార్ హెగ్డే మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాంధీ నేతృత్వంలో జరిగిన స్వాతంత్య్ర పోరాటం అంతా డ్రామా అని, ప్రజలు గాంధీని మహాత్మా అని పిలిచినప్పుడల్లా తన రక్తం మరిగిపోతుందని అన్నారు. ఈయన చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద వివాదానికి దారి తీసింది.
బెంగళూరులో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ... గాంధీజీ నడిపిన స్వాసంత్య్ర ఉద్యమమంతా బ్రిటీష్ వాళ్ల అనుమతితో, వారి ప్రోద్బలంతోనే సాగింది అని , ప్రముఖులైన ఈ నాయకులెవరూ ఎప్పూడు ఒక్క లాఠీ దెబ్బ కూడా తినలేదు అని , వాళ్ల స్వాసంత్య్ర ఉద్యమమంతా ఓ నాటకం. అదంతా బ్రిటీష్ వాళ్లతో కుమ్మక్కయి నడిచిందే. అది నిజమైన పోరాటం కాదు అని సంచలన ఆరోపణలు చేసారు.
గాంధీ చేపట్టిన నిరాహార దీక్షలను, సత్యాగ్రహ ఉద్యమాలను హెగ్డే డ్రామాగా అభివర్ణించారు. గాంధీ చేపట్టిన నిరాహార దీక్ష, సత్యాగ్రహం వల్లే స్వాతంత్య్రం వచ్చిందని కాంగ్రెస్ మద్దతు దారులు చెబుతున్నారు. కానీ అది నిజం కాదు. సత్యాగ్రహం వల్ల బ్రిటిషర్లు దేశాన్ని వీడలేదు అని, బ్రిటిష్ వారి ఫ్రస్టేషన్ కారణంగానే బ్రిటిషర్లు భారత్ కు స్వాతంత్య్రం ఇచ్చారని, చరిత్ర చదివినప్పుడు గాంధీని మహాత్మాడిగా పోల్చడం కనిపిస్తే, నాకు రక్తం మరిగిపోతుంది అని అన్నారు. ఈయన చేసిన ఈ వ్యాఖ్యలపై ప్రస్తుతం పెద్ద వివాదం మొదలైంది.