Begin typing your search above and press return to search.

‘జనగనమణ’లో సింధు పాక్ లో ఉంది..మార్చేయండి : మోడీకి లేఖ!

By:  Tupaki Desk   |   2 Dec 2020 11:45 AM GMT
‘జనగనమణ’లో సింధు పాక్ లో ఉంది..మార్చేయండి : మోడీకి లేఖ!
X
జాతీయ గీతం జనగనమణ ను మార్చాలని బీజేపీ సీనియర్ నేత, ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ప్రధాని మోడికి లేఖ రాశారు. ప్రస్తుత ఉన్న జాతీయ గీతంలో మార్పు చేయాలంటూ మోదీకి సుబ్రమణ్యస్వామి లేఖ రాయడంతో , ప్రస్తుతం ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇందులోని అనవసర పదాలను తొలగించాలని కోరారు. జాతీయగీతం లోని అనవసర పదాలను తొలగించి, అవసరమైన పదాలతో జాతీయ గీతాన్ని పునరుద్ధరిస్తామని 1949 నవంబరు 26న నాటి రాష్ట్రపతి డాక్టర్‌ రాజేంద్ర ప్రసాద్‌ చెప్పారని ఈ సందర్భంగా స్వామి గుర్తు చేశారు.

జనగనమణ గీతం పాడితే ఎవరిని ప్రశంసిస్తూ రాశారో అనే అనుమానాలను స్వామి లేఖలో వ్యక్తం చేశారు. ఆ స్థానంలో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ నేతృత్వంలోని ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ 1943 అక్టోబరు 21న ఇంఫాల్‌ను స్వాధీనం చేసుకున్నప్పుడు ఆలపించిన గీతాన్ని అమలు చేయాలని లేఖలో తెలిపారు. ఆ గీతంలో వచ్చే సింధ్ ప్రాంతం ఇప్పుడు పాకిస్థాన్ భూభాగంలో ఉందని, ఇప్పుడా పదాన్ని తొలగించి ఈశాన్యం అనే పదాన్ని జోడించాలని 2019లో కాంగ్రెస్ ఎంపీ రిపున్ బోరా రాజ్యసభలో ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టారని గుర్తుచేశారు.

కొత్త జాతీయ గీతాన్ని వచ్చే రిపబ్లిక్ దినోత్సవంలోపు రూపొందించాలని స్వామి లేఖలో సూచించారు. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జనగణమణను 1911 డిసెంబరు 27న కలకత్తా వేదికగా జరిగిన భారత జాతీయ కాంగ్రెస్‌ సమావేశంలో తొలిసారి ఆలపించారని సుబ్ర మణ్యస్వామి పేర్కొన్నారు. అందులోని భారత భాగ్య విధాత పదానికి బదులు 1943లో ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ షుభ్‌ సుఖ్‌ చైన్‌ అనే పదాన్ని చేర్చి ఆలపించింది. ఈ కొత్త జాతీయ గీతాన్ని బోస్‌ రచించగా కెప్టెన్‌ రామ్ ‌సింగ్‌ స్వరపరిచారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.