Begin typing your search above and press return to search.

బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   14 Dec 2020 11:20 PM IST
బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
X
దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నేతల నోరు జారే మాటలు ఎక్కువయ్యాయని పలువురు ఆరోపిస్తున్నారు. చాలా మంది బీజేపీ నేతలు ఇప్పటికీ హిందుత్వ, జాతీయ అజెండాతో తీవ్ర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. తాజాగా బ్రహ్మాణులను పోలుస్తూ శుద్రూలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు భోపాల్ కు చెందిన వివాదాస్పద ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్.

బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఇప్పటికే ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. మతపరమైన గ్రంథాలు, ధర్మశాస్త్రాల గురించి నోరుపారేసుకున్నారు

తాజాగా మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. క్షత్రియులను క్షత్రియులని పిలిస్తే వారేమీ అనుకోరని, అలాగే బ్రాహ్మణులను కులం పేరుతో పిలిస్తే తప్పుగా అనుకోరని, వైశ్యులను వైశ్యులంటే ఏమీ అనుకోరని, శూద్రులను మాత్రం శూద్రులంటే తెగ ఫీలవుతారని ప్రజ్ఞా ఠాకూర్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందుకు కారణం వారి అవగాహనలోపమని తెలిపారు.

పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కూడా ఆమె అనుచిత వ్యాఖ్యలు చేశారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాపై బెంగాల్‌లో జరిగిన దాడి పట్ల మమతా సరిగ్గా స్పందించలేదన్నారు.. బహుశా ఆమెకు పిచ్చిపట్టిందేమోనని ప్రజ్ఞాఠాకూర్‌ వ్యాఖ్యానించారు.