Begin typing your search above and press return to search.

బీజేపీ ఎమ్మెల్యే రేప్‌ కేసు..న్యాయం చేయాలంటూ మోడీకి లేఖ!

By:  Tupaki Desk   |   3 Oct 2020 4:20 PM IST
బీజేపీ ఎమ్మెల్యే రేప్‌ కేసు..న్యాయం చేయాలంటూ మోడీకి లేఖ!
X
తన పై అత్యాచారం చేసిన ఉత్తరాఖండ్ బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మహేష్ నేగిపై చర్యలు తీసుకోవాలని బాధిత మహిళ డిమాండు చేశారు.ఈ ఘటనపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని బాధితురాలు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. తన నాలుగు పేజీల లేఖలో రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం, పోలీసులు.. నిందితుడైన ఎమ్మెల్యేను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఘటనపై నిష్పాక్షికంగా విచారణ జరిపి నిందితుడిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

నిందితుడైన ఎమ్మెల్యేను రక్షించే ప్రయత్నంలో పోలీసులు వాస్తవాలను వక్రీకరిస్తున్నారని, క్లియింటుతో రాజీ కుదుర్చుకోవాలని కోరారు...ఈ ఘటనపై న్యాయమైన, నిష్పాక్షికమైన దర్యాప్తు జరిపించండి అంటూ బాధితురాలు ప్రధానికి రాసిన లేఖలో పొందుపరిచింది. బాధితురాలి తరపు న్యాయవాది ఎస్పీ సింగ్‌ మాట్లాడుతూ.. 'న్యాయస్థానం, పోలీసులు సరియైన దర్యాప్తు చేయకుండా ఎమ్మెల్యేను కాపాడుతున్నందునే బాధిత మహిళ సీబీఐ విచారణ కోరుతూ ప్రధానికి లేఖ రాసింది. ఎమ్మెల్యేను రక్షించే క్రమంలో పోలీసులు వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. నా క్లయింట్‌ని అతనితో రాజీ కుదుర్చుకోవాలని కోరారు. అందువల్ల న్యాయమైన, నిష్పాక్షిక దర్యాప్తును కోరుతూ ఆమె ప్రధానికి లేఖ రాశారు' అని‌ తెలిపారు. కాగా దీన్ని ఉత్తరాఖండ్ పోలీసులు ఖండిస్తున్నారు.