Begin typing your search above and press return to search.

క్రాకర్స్ బ్యాన్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ ఫైర్ !

By:  Tupaki Desk   |   13 Nov 2020 6:20 PM IST
క్రాకర్స్ బ్యాన్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ ఫైర్ !
X
దీపావళి పండుగ సందర్భంగా టపాసులను బ్యాన్ చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీపావళి పండుగలో క్రాకర్స్ పేల్చకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో న్యాయవాది ఇంద్రప్రకాష్ పీల్ దాఖలు చేశారు. తెలంగాణ రాష్ట్రం కరోనా కేసులు ఇంకా ఉన్నాయని ఈ సమయంలో క్రాకర్స్ కాల్చడం వలన ప్రజలు ఇబ్బందులు పడుతారని పిటిషనర్ తన పిల్ లో పేర్కొన్నాడు. క్రాకర్స్ వలన ప్రజలు శ్వాస కోశ ఇబ్బందులు పడుతారని పిటీషనర్ కోర్టుకు తెలిపారు. పిటీషనర్ వాదనలను హై కోర్ట్ పరిగణనలోకి తీసుకున్న కోర్టు క్రాకర్స్ బ్యాన్ చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.

అయితే , రాష్ట్రంలో క్రాకర్స్ బ్యాన్ పై బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ ఫైర్ అయ్యారు. క్రాకర్స్ బ్యాన్ చేయాలని కోర్టుకి వెళ్లిన అడ్వొకేట్ కి దీపావళి పండుగ ఎప్పుడు వస్తుందో తెలియదా అంటూ ప్రశ్నించారు. ఇప్పుడు కేసు వేసి బ్యాన్ చేయిస్తే వాటిని అమ్మేందుకు తెచ్చిన వ్యాపారులు ఎక్కడ పోవాలి అని , పోలీసులు రైడ్ చేసి మూసి వెయిస్తున్నారు..వాళ్లు ఇప్పుడు వాటిని ఎక్కడ స్టోర్ చేసుకోవాలి. ఇళ్లలో పెట్టుకుంటే ఏదన్నా జరగరానిది జరిగితే ఎవరు బాద్యులు అని అడిగారు అడిగారు.

అప్పుతెచుకున్న వారి పరిస్థితి ఏంది అని ప్రశ్నించిన ఆయన దీపావళి ఎప్పటి లాగానే జరుగుతుంది అని తెలిపారు. గోవుల ను వదించొద్దని చట్టం ఉంది. క్రాకర్స్ బ్యాన్ పై ఉత్సాహం చూపుతున్న పోలీస్ లు గోవుల వధ విషయంలో ఎందుకు స్పందించడం లేదు అన్నారు ఆయన. ఎంఐఎం మెప్పు కోసమే ఇదంతా చేస్తున్నారు. హిందువుల పట్ల ఇలానే వ్యవహరిస్తే నిజామాబాద్ ,దుబ్బాక,లో ఏమి జరిగిందో రేపు జీహెచ్‌ఎంసీ లో అదే జరుగుతుంది అని హెచ్చరించారు.