Begin typing your search above and press return to search.
కరోనాతో మరో బీజేపీ ఎమ్మెల్యే బలి!
By: Tupaki Desk | 30 Nov 2020 3:00 PM ISTకరోనా మహమ్మారి ఇప్పటికే ఎందరో సినీ, రాజకీయ ప్రముఖులను బలి తీసుకున్నది. ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. తాజాగా బీజేపీకి చెందిన ఓ ఎమ్మెల్యే కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. రాజస్థాన్‌లోని రాజసమంద్ ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరికు ఇటీవల కరోనా సోకింది. ఆమెను కుటుంబసభ్యులు వెంటనే హర్యానా గుర్‌గావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ ఆమె ప్రాణాలను కాపాడలేకపోయారు. ఆమెకు కొన్నిరోజులుగా వెంటిలేటర్‌పై చికిత్సనందిస్తూ వచ్చారు. ఆధునాతన వైద్యం అందించారు. కిరణ్ మహేశ్వరిని బతికించేందుకు తాము చివరవరకు ప్రయత్నించామని, కానీ కాపాడలేకపోయమని వైద్యులు చెప్పారు. ఆమె భౌతికకాయాన్ని మేదాంత ఆసుపత్రి నుంచి ఉదయ్‌పూర్‌కు తరలించారు.
సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. మహేశ్వరి మృతిపట్ల బీజేపీ కార్యకర్తలు, రాజసమంద్ ప్రజలు శోకసంద్రంలో మునిగిపోయారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజాసమస్యలను పరిష్కరించే నేత తమ మధ్య లేకపోవడం ఎంతో బాధాకరమని వారు వారు వేదన వ్యక్తం చేశారు. నిత్యం ప్రజల్లో ఉండే కిరణ్ మహేశ్వరి కరోనా లాక్డౌన్ తో ఇంట్లో నే ఉండి పోయారు. కానీ లాక్ డౌన్ ఎత్తేశాక.. ప్రజల మధ్యకు వెళ్లారు. కరోనా తో ఉపాధి కోల్పోయిన పలువురి కి ఆమె అండగా నిలబడ్డారు. నియోజకవర్గ ప్రజలకు తన వంతు సాయం అందించారు. ఆ సమయంలోనే ఆమె కు కరోనా సోకింది. ఆమె మృతి తో నియోజకవర్గ ప్రజలు శోక సంద్రలో మునిగి పోయారు.