Begin typing your search above and press return to search.
కరోనా: బీజేపీ ఎమ్మెల్యే సోదరుడి ఆత్మహత్య
By: Tupaki Desk | 5 Sept 2020 10:15 AM ISTప్రపంచాన్ని ఆవహించిన కరోనా అందరినీ మానసికంగా.. శారీరకంగా చంపేస్తోంది. ఆ భయం అందరిలోనూ భయానకంగా ఉంటోంది. మానసికంగా ధృడంగా లేకపోతే ప్రాణాలే పోయే ప్రమాదం కనిపిస్తోంది.
కరోనా వైరస్ సోకిందన్న బాధ, భయంతో బీజేపీ ఎమ్మెల్యే సోదరుడు కోవిడ్ వార్డు భవనం నుంచి దూకి ప్రాణాలు కోల్పోయిన విషాద సంఘటన ఉత్తరప్రదేశ్ లో విషాదం నింపింది.
కన్నౌజ్ జిల్లా తిర్వాగంజ్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే కైలాష్ రాజ్ పుత్ సోదరుడు సంజయ్ రాజ్ పుత్ (45) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో సంజయ్ ఆయన భార్య కన్నౌజ్ లోని మెడికల్ కాలేజి కోవిడ్ సెంటర్ లో చేరారు. కోవిడ్ చికిత్స పొందుతున్న ఆయన శుక్రవారం మధ్యాహ్నం తరువాత సడెన్ గా భవనంపైనుంచి పరిగెత్తి అక్కడి నుంచి కిందకు దూకాడు.
సమాచారం అందుకున్న బీజేపీ ఎమ్మెల్యే, ఆయన సోదరుడు కైలాష్ రాజ్ పుత్ , పోలీసులు అక్కడికి చేరుకొని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.
సంజయ్ కరోనాతో డిప్రెషన్ తో చనిపోయాడా? లేక ఇంకేమైనా కారణాలా అన్నది పోలీసులు విచారిస్తున్నారు.