Begin typing your search above and press return to search.

నెహ్రూ ఎద్దు - పందిమాసం తినేవారు..

By:  Tupaki Desk   |   11 Aug 2018 12:33 PM IST
నెహ్రూ ఎద్దు - పందిమాసం తినేవారు..
X
హిందుత్వ బీజేపీ ఎమ్మెల్యే ఒకరు కాంగ్రెస్ ను టార్గెట్ చేసి ఇరుకున పెట్టారు. ఆయన దివంగత భారత మొదటి ప్రధానిపై చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. జవహర్ లాల్ నెహ్రూ గోవు - పందిమాసం తిరేవారని.. అసలు ఆయన పండిట్ కాదంటూ రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే గయాన్ దేవ్ అహూజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్థానిక అల్వార్ ఎమ్మెల్యే క్వార్టర్ లను పరిశీలించిన ఆయన ఈ సందర్భంగా నెహ్రూపై మండిపడ్డారు. గొడ్డు - పందిమాసం తిరేవారిని పండిట్ అని ఎలా పిలుస్తారని మండిపడ్డారు. ఓట్లు - మైలేజ్ కోసమే కాంగ్రెస్ నేతలు నెహ్రూ ముందు పండిట్ అని పేరు పెట్టారని ఎద్దేవా చేశారు.

కాగా అహూజా వ్యవహారశైలి ఆది నుంచి వివాదాస్పదమే..ఇయన ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలూ తరుచూ చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. గతంలో గోవును చంపుట ఉగ్రవాదం కన్నా పెద్ద నేరమని వ్యాఖ్యానించారు. హిందూ బాలికలను లవ్ జీహాద్ పేరిట బలవంతంగా ముస్లింలుగా మతమార్పిడికి పాల్పడుతున్నారంటూ విమర్శించారు. ఢిల్లీలో జరిగే లైంగిక దాడులకు 50శాతం బాధ్యత జేఎన్టీయూ విద్యార్థులదే అని వ్యాఖ్యానించి దుమారం రేపారు. తాజాగా నెహ్రూపై నోరు పారేసుకున్నారు. దీనిపై రాజస్థాన్ పీసీసీ ప్రెసిడెంట్ సచిన్ పైలెట్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అహూజాకు మతి చెడిదంటూ మండిపడ్డారు.