Begin typing your search above and press return to search.

అమిత్ షా ముందు అమాత్యులు క్యూ క‌ట్టారు

By:  Tupaki Desk   |   2 Sep 2017 10:19 AM GMT
అమిత్ షా ముందు అమాత్యులు క్యూ క‌ట్టారు
X
ఈ మ‌ధ్య‌కాలంలో జాతీయ పార్టీలకు చెందిన ఏ అధ్య‌క్షుడు అయినా ప్ర‌భుత్వంలోని మంత్రుల మీద ఆధిప‌త్యం చెలాయించ‌డం చూశారా ? అధ్య‌క్షుడు ఆదేశిస్తే రాజీనామా చేతిలో పెట్టి జీ హుజూర్ అంటూ ప‌క్క‌కు త‌ప్పుకున్న సంధ‌ర్భాలు ఉన్నాయా ? అస‌లు పార్టీ అధ్య‌క్షుడు పిలిస్తే కేంద్ర‌మంత్రి వెల్ల‌డ‌మే గ‌గ‌నం. అలాంటిది ఇక రాజీనామా అడిగితే ర‌చ్చ రంబోల అయిపోతుంది. జాతీయ మీడియా గుండెలు బాదుకుంటుంది. ఇదంతా గ‌తం. ఇప్పుడు ప‌రిస్థితులు మారాయి.

భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా చెప్పిందే ఇప్పుడు ఆ పార్టీలో వేదం. అమిత్ షా చెబితే మోడీ చెప్పిన‌ట్లే .. మోడీ అదేశిస్తే అమిత్ షా అదేశించిన‌ట్లే. క్యాబినెట్ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ నేప‌థ్యంలో ప‌లువురు మంత్రుల‌ను పిలిచి రాజీనామా చేయాల‌ని అమిత్ షా ఆదేశిస్తే కిక్కురుమ‌న‌కుండా రాజీనామా లేఖ‌లు ఇచ్చి వెళ్లారు. రాజీనామా చేయ‌కున్నా ప‌ద‌వి నుండి ఉద్వాస‌న త‌ప్ప‌ద‌ని వారికి తెలుసు. అయితే పార్టీలో కొన్నాళ్లు మంచిగా ప‌నిచేస్తే .. అమిత్ షా ఆశీర్వాదం ఉంటే తిరిగి మ‌రోసారి ప‌ద‌వి వ‌రిస్తుంద‌న్న ఆలోచ‌న‌తోనే వారు కిక్కురుమ‌న‌డం లేద‌ని అంటున్నారు.

ఒక‌ప్ప‌టి బీజేపీ ఫైర్ బ్రాండ్ ఉమాభార‌తి రాజీనామా చేయ‌డం పార్టీలో అమిత్ షా పట్టుకు నిద‌ర్శ‌నం అని చెబుతున్నారు. కేంద్రంలోని మంత్రులు కూడా త‌మ ప‌నికి సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్ ఎప్ప‌టిక‌ప్పుడు అమిత్ షాకు ఇస్తున్నార‌ని తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అంటే గాంధీ కుటుంబ ఆధిప‌త్యం .. కానీ బీజేపీలో ఇలాంటి అధ్య‌క్షుడిని చూడడం .. అదీ కేంద్ర రాజ‌కీయాల్లో ఇలాంటి అధ్య‌క్షుడుని చూడ‌డం చాలా అరుద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అంటున్నారు. మొత్తానికి మోడీ - అమిత్ షా జోడి బీజేపీని ఎటువైపు తీసుకెళ్తారో వేచిచూడాలి.