Begin typing your search above and press return to search.

రైతులపై బీజేపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   20 Jan 2021 7:00 PM IST
రైతులపై బీజేపీ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు
X
తాజాగా కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్, గుజరాత్ డిప్యూటీ సీఎం నితిన్ పాటిల్, బీజేపీ నేత రాంమాధవ్ లకు రైతులు నోటీసులు పంపారు. వీరు ఖలిస్తాన్ తీవ్రవాదులు సైతం రైతుల ఉద్యమంలో ఉన్నారని ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసశారు. తక్షణమే బేషరుతుగా క్షమాపణలు చెప్పాలని వీరు డిమాండ్ చేశారు.

ఈ విషయం తీవ్రవివాదం కావడంతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రంగంలోకి దిగి సర్ధిచెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. జేపీ నడ్డా హెచ్చరికతో రైతులపై కేంద్రమంత్రులు కూడా నోరు అదుపులో పెట్టుకున్నారు.

తాజాగా ఇంత రాద్ధాంతం జరిగినా కూడా కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్ రైతులపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆత్మహత్య చేసుకునే రైతులు మానసికంగా బలహీనులని.. అలాంటి ఆత్మహత్యలను ప్రభుత్వం మెడకు చుట్టడం సరికాదని వ్యాఖ్యానించారు. రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వాలు కారణం కాదని ఆయన చెప్పుకొచ్చారు.రైతులే కాదు.. ఇతరూ సూసైడ్ చేసుకుంటున్నారని.. అందరికీ ప్రభుత్వం బాధ్యత వహించాలని ఆ మంత్రివర్యులు రైతులపై నోరుపారేసుకున్నారు. ఇప్పుడీ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.