Begin typing your search above and press return to search.

వచ్చే ఎన్నికల్లో బీహార్ లో అధికారం కోసం బీజేపీ మాస్టర్ ప్లాన్ !

By:  Tupaki Desk   |   27 Dec 2019 6:23 AM GMT
వచ్చే ఎన్నికల్లో బీహార్ లో అధికారం కోసం బీజేపీ మాస్టర్ ప్లాన్ !
X
ఈ మధ్య కాలం లో బీజేపీ కి కాలం అసలు కలిసి రావడం లేదు. రెండోసారి కేంద్రంలో అధికారాన్ని చేపట్టి ..ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ కూడా బీజేపీ కొన్ని రాష్ట్రాలలో తన ప్రభావాన్ని కోల్పోతూ వస్తుంది. గత కొన్ని రోజుల ముందు మహారాష్ట్ర లో జరిగిన రాజకీయం గురించి అందరికి తెలిసిందే. శివసేన తో పొత్తు తో బరిలోకి దిగిన బీజేపీ బంపర్ విక్టరీ అయితే కొట్టింది కానీ ,అధికారాన్ని మాత్రం నిలబెట్టుకోలేకపోయింది. అలాగే ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ (ఎజె ఎస్‌ యు) నుంచి విడిపోయిన తరువాత తాజాగా జరిగిన జార్ఖండ్ ఎన్నికల్లో బిజెపి ఘోర పరాజయాన్ని చవిచూసింది.

దీనితో బీహార్‌ లో పార్టీ నాయకత్వం ఈ రోజు జనతాదళ్ యునైటెడ్‌ తో పొత్తు బలంగా ఉందని, సీట్లపై విభేదాల వల్ల ప్రభావితం కాదని స్పష్టంచేసింది. బీహార్లో ఎన్డీఏ ఐక్యంగా ఉంది, సీట్ల భాగస్వామ్యం విషయం లో ఎటువంటి తేడాలు లేవు. మా కూటమి కి ఐదుసార్లు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వం వహించారు అంటూ ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ మోడీ ట్వీట్టర్ వేదికగా తెలిపారు. అలాగే జార్ఖండ్‌ లో కూటమి ప్రభుత్వానికి నాయకత్వం వహించబోతున్న జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు హేమంత్ సోరెన్‌ ను కూడా ఆయన ప్రశంసించారు. ఎన్నికలలో కాంగ్రెస్-జెఎంఎం పొత్తు జార్ఖండ్‌ లో అద్భుతమైన విజయాన్ని సాధించింది అని , అలాగే జార్ఖండ్ లో బిజెపి 25 సీట్లు గెలుచుకుంది అని , అక్కడ బలమైన ప్రతిపక్ష పాత్ర వహిస్తుంది అని తెలిపారు. అయితే, బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన తేజశ్వి యాదవ్ దీనిపై మాట్లాడుతూ .. వచ్చే ఏడాది బీహార్ లో జరిగే అసెంబ్లీ ఎన్నికల పై ఇది ప్రభావం చూపుతుందని తెలిపారు.

కానీ, జార్ఖండ్‌ తో పాటుగా, మహారాష్ట్ర లో కూడా బిజెపి కి భారీ నష్టం జరిగింది. దీనిపై శిరోమణి అకాలీదళ్ నాయకుడు నరేష్ గుజ్రాల్ మాట్లాడుతూ.. బిజెపి మిత్ర పార్టీలు ఎక్కువ భాగం నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ ఆర్ సి) వంటి అంశాలపై అసంతృప్తి గా ఉన్నాయని తెలిపారు. దీని ప్రభావం వచ్చే ఎన్నికలలో కనిపిస్తుంది అని చెప్పగా .. బిజెపి ఎంపి రామ్‌కృపాల్ యాదవ్ మాత్రం బీహార్‌ లోని మిత్రుల మధ్య అసమ్మతి సూచనలు లేవు అని కొట్టిపడేసారు. నితీష్ కుమార్ చేసిన అసాధారణమైన పని వచ్చే ఏడాది కూటమిని తిరిగి అధికారంలోకి తీసుకువస్తుంది అని ధీమా వ్యక్తం చేసారు.