Begin typing your search above and press return to search.
బీజేపీ నేతల సంచలన కామెంట్లు... నెక్ట్స్ ఏంటో తెలుసా?
By: Tupaki Desk | 11 Nov 2020 7:39 AM ISTతెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠను సృష్టించిన దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. 1079 ఓట్ల మెజారిటీతో తెరాస పార్టీపై విజయం సాధించింది. బీజేపీ ప్రత్యేక విజయం సాధించింది. దుబ్బాకలో విజయం సాధించడంతో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇదే సమయంలో ఆ పార్టీ నేతలు మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఓ రేంజ్‌లో టార్గెట్ చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ, దుబ్బాక ఉప ఎన్నిక విజయం తెలంగాణ ప్రజలందరీ విజయమని పేర్కొన్నారు. బీజేపీ గెలుపు ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వ్యతిరేకత అని స్పష్టం చేశారు. దుబ్బాక ప్రజల్లో నిజాయితీ ఉందని.. ఇదే స్ఫూర్తితో గోల్కొండ కోటపైనే బీజేపీ జెండా ఎగురవేస్తామని బండి సంజయ్ అన్నారు. తెలంగాణలో రామరాజ్య స్థాపనకు మలిదశ ఉద్యమమని పేర్కొన్నారు. దుబ్బాకలో తమపై అనేక అవాస్తవాలు ప్రచారం చేశారని తెలిపారు. దుబ్బాక గెలుపు నేపథ్యంలో విజయోత్సవాలు జరుపుకుంటామంటే అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
ఉప ఎన్నికలో గెలుపొందినట్లు అధికారిక పత్రం తీసుకున్న అనంతరం బీజేపీ అభ్యర్థి రఘనందన్‌రావు మీడియాతో మాట్లాడుతూ ఈ చారిత్రక తీర్పు పాలకులకు కనువిప్పు కావాలన్నారు. ఈ విజయం దుబ్బాక ప్రజలకు అంకితమని రఘనందన్‌రావు అన్నారు. ప్రజలు చైతన్యవంతులు కాబట్టే దుబ్బాకలో బీజేపీని గెలిపించారని పేర్కొన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక సీఎం కేసీఆర్‌కు గుణపాఠమని ఫైర్ అయ్యారు. ఈ సౌండ్ వినాలని ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నానని రఘునందన్ రావు పేర్కొన్నారు. దుబ్బాక విజయానికి సహకరించిన కార్యకర్తలకు, నేతలకు ఈ సందర్భంగా కృతజ్ఙతలు చెప్పారు. ఒక మనిషిని ఎన్ని విధాల వేధించారో అంతలా తనను వేధించారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికీ దుబ్బాక ప్రజలు తనకు అండగా ఉన్నరని పేర్కొంటూ వారికి కృతజ్ఙతలు తెలిపారు.
దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన విజయం సాధించడంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కు ఆయువుపట్టు లాంటి దుబ్బాకలోనే గెలిచామని, ఇకపై ఈ జోరును రాష్ట్రవ్యాప్తంగా చూపిస్తామన్నారు. దుబ్బాక ఎన్నిక ఫలితం రాష్టవ్యాప్తంగా ఉంటుందని…త్వరలో జరగనున్న GHMC ఎన్నికల్లోనూ సత్తా చాటుతామని కిషన్ రెడ్డి అన్నారు. దుబ్బాక విజయం బీజేపీకి ఎంతో బలాన్నిస్తుందని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఉత్సాహంగా పనిచేసేందుకు ఉపయోగపడుతుందని కిషన్ రెడ్డి అన్నారు . దుబ్బాక విజయం ప్రజల విజయమని తెలిపారు.
టీఆర్ఎస్ కుటుంబపాలనకు టీఆర్ఎస్ పార్టీనే ప్రత్యామ్నాయమని ఈ ఎన్నిక రుజువు చేసిందని బీజేపీ సీనియర్ నేత రామ్ మాధవ్ అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. దుబ్బాకలో రఘునందన్ రావు చరిత్రాత్మక విజయం సాధించారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్ అన్నారు. గెలుపు కోసం టీఆర్ఎస్ డబ్బును వెదజల్లిందని, అధికార దుర్వినియోగానికి పాల్పడిందన్నారు. పోలీసులతో వేధింపులకు కూడా దిగిందని విమర్శించారు.