Begin typing your search above and press return to search.

ఓటుకు నోటుపై బీజేపీ ఏం చెప్పాలనుకొంటోంది?

By:  Tupaki Desk   |   9 Jun 2015 5:16 AM GMT
ఓటుకు నోటుపై బీజేపీ ఏం చెప్పాలనుకొంటోంది?
X
తప్పు చేసిన వారిని రక్షించడానికి ప్రయత్నించం అంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు భారతీయ జనతా పార్టీ నేత మురళీధర్‌ రావు. 'ఓటుకు నోటు' వ్యవహారంలో రేవంత్‌ రెడ్డి అరెస్టవ్వడం, తెలుగుదేశం అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సంబంధించిన ఆడియో టేపులు వెలుగు చూడటం.. ఈ పరిణామాలపై అటు ఏపీ ముఖ్యమంత్రి, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకొంటూ ఉండటంతో భారతీయ జనతా పార్టీ కూడా స్పందించక తప్పని పరిస్థితి ని ఎదుర్కొంటోంది.

ఈ నేఫథ్యంలో ఆ పార్టీ నేత మురళీధర్‌రావు ఆసక్తికరమైన ప్రకటన చేశాడు. ఇప్పటికే వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ వంటి వారు భిన్నమైన ప్రకటనలు చేశారు. రాజకీయాలు పక్కనపెట్టి అభివృద్ధిపై దృష్టిపెట్టాలని వెంకయ్య హితబోధ చేయగా .. అంతా గవర్నర్‌ చూసుకొంటాడు అంటూ దత్తాత్రేయ ముక్తాయించ ప్రయత్నించాడు.

వీరిద్దరికీ భిన్నంగా స్పందించాడు మురళీధర్‌ రావు. తప్పు చేసిన వారిని రక్షించచోం అంటూ ఆయన వ్యాఖ్యానించాడు.ఈ వ్యవహారంలో నిజాలను దాచే ప్రయత్నం జరగకూడాదని కూడా ఆయన అన్నాడు. ఈ కేసు విచారణ నిస్పక్షపాతంగా పారదర్శకంగా సంచనాలకు దూరంగా జరగాలని ఆయన అన్నాడు. నిజానిజాలుతెలుసుకొనే హక్కు అధికారాలు ప్రజలకు ఉన్నాయని ఈయన చెప్పుకొచ్చారు.

ప్రధానమంత్రినరేంద్రమోడీ అయితే నీతిమంతమైన పాలన లక్ష్యంతో పని చేస్తున్నారని కూడా ఈ నేత వ్యాఖ్యానించారు. మరి తమ పార్టీకిమిత్రుడుఅయిన చంద్రబాబు నాయుడి వివాదంలో ఇరుక్కొన్న వేళ ఈ కమలనాథుడు ఇలా స్పందించడంలో ఆంతరార్థం ఏమిటో!