Begin typing your search above and press return to search.
కేసీఆర్ ఢిల్లీ టూరుపై చెడుగుడు ఆడేస్తున్న కమలనాథులు
By: Tupaki Desk | 16 Dec 2020 8:49 AM ISTఇటీవల ఢిల్లీకి వెళ్లి.. మూడు రోజులు ఉండి వచ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు. గ్రేటర్ ఎన్నికల్లో ఎదురైన ఓటమితోనే తాజాగా ఆయన ఢిల్లీ పర్యటన సాగినట్లుగా చెబుతున్నారు. తనకు ఎదురైన ఓటమిని తట్టుకోలేక.. రాష్ట్ర ప్రజల్లో అయోమయాన్ని క్రియేట్ చేయటం కోసమే కేసీఆర్ ఢిల్లీ పర్యటన సాగిందని.. బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాము చేస్తున్న వాదనల్లో నిజం ఎంత ఉందన్న విషయాన్ని చెప్పేందుకు వారు ఒక ఉదాహరణను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు.
ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ప్రధానమంత్రిని కలిస్తే.. తనతో పాటు అధికారుల్నితీసుకెళ్లాలని.. కానీ.. అదేమీ జరగలేదన్నారు. అసలు ఎందుకు వెళ్లారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఎప్పుడు ఢిల్లీ వెళ్లినా.. తనతోపాటు ఎవరో ఒకరిని తీసుకెళుతుంటారని.. అలాంటి ఆయన తాజాగా మాత్రం తానొక్కడే వెళ్లారని గుర్తు చేస్తున్నారు. గతానికి భిన్నంగా.. కేసీఆర్ ఒక్కరే ఎందుకు వెళ్లారు? ఇంకెవరిని ఎందుకు తీసుకెళ్లనట్లు? అని ప్రశ్నిస్తున్నారు.
తన అవినీతి ఎక్కడ బయటపడుతుందో అన్న భయమే తాజా ఢిల్లీ పర్యటనకు కారణంగా బీజేపీ ఎంపీ సోయం బాపూరావు. ఈ ఎంపీకి బాసటగా.. బీజేపీ తెలంగాణ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తోడయ్యారు. ప్రజల్లో ఆయోమయానికిగురి చేయటానికే తన ఢిల్లీ పర్యటనను వాడుతున్నారన్నారు. కేసీఆర్ వంగి వంగి పొర్లు దండాలు పెట్టినా క్షమించం.. ప్రజల చూపు మరల్చటానికే ఆయన ఢిల్లీ పర్యటన సాగినట్లుగా చెప్పాలి. ఎప్పటిలానే కేసీఆర్ జైలుకు వెళ్లటం ఖాయమన్న మరో మాట సంజయ్ నోటి నుంచి వచ్చింది. మొత్తానికి కేసీఆర్ తాజా ఢిల్లీ టూర్ విషయంలో తెలంగాణ బీజేపీ నేతలు ఏకిపారేస్తుండటం గమనార్హం.