Begin typing your search above and press return to search.
సుప్రీంలో షాకింగ్ పిల్ వేసి సంచలనంగా మారిన బీజేపీ నేత
By: Tupaki Desk | 16 Nov 2020 11:15 AM ISTబీజేపీ నేత కమ్ న్యాయవాదిగా సుపరిచితులు అశ్వినీ కుమార్ ఉపాధ్యాయ వార్తల్లోకి వచ్చారు. తాజాగా ఆయన సుప్రీం కోర్టులో వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఇప్పుడు సంచలనంగా మారింది. అవినీతి.. నల్లధనం.. బినామా.. ఆదాయానికి మించిన ఆస్తులు.. మనీ లాండరింగ్.. పన్ను ఎగవేత కేసుల్లో దోషులకు విధించాల్సిన శిక్షల గురించి ఆయన కోరుతున్నవైనం షాకింగ్ గా మారటమే కాదు.. అవినీతిపరుల వెన్నులో చలిపుట్టేలా మారిందని చెప్పక తప్పదు.
ఇంతకీ ఈ పిల్ లో ఉపాధ్యాయ కోరుతున్నదేమంటే.. అవినీతి.. బ్లాక్ మనీ.. పన్ను ఎగవేత సొమ్ములకు సంబంధించిన నేరాల్లో శిక్షలు కనిష్ఠంగా ఉంటున్నాయని.. మిగిలిన దేశాల్లో మాదిరి కఠిన తరం చేయాలని ఆయన కోరుతున్నారు. భారత్ లో అవినీతి నిరోధక చట్టాలు బలహీనంగా ఉండటమే కాదు.. వాటి ప్రకారం గరిష్ఠంగా ఏడేళ్ల వరకు జైలు విధించటం తప్పించి మరింకేమీ చేయరన్నారు. అవినీతి ద్వారా సంపాదించిన మొత్తాల్ని వందశాతం వెనక్కి తీసుకోవటం ఉండదన్నవిషయాన్ని గుర్తు చేశారు.
అందుకే.. తీవ్రమైన ఆర్థిక నేరాలకుపాల్పడే వారికి విధించాల్సిన శిక్షలు తీవ్రంగా ఉండాలని ఆయన కోరుతున్నారు. అగ్రరాజ్యమైన అమెరికాతో సహా పలు దేశాల్లో తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడిన 97 మందికి గత రెండు దశాబ్డాల్లో 100 నుంచి వేల ఏళ్ల పాటు జైలుశిక్ష విధించిన విషయాన్ని ఆయన గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యుత్తమ అవినీతి నిరోధక చట్టాల్ని రూపొందిచాలని ఆయన కోరుతున్నారు. తన వినతిని మన్నించి సుప్రీంకోర్టు.. తాను కోరినట్లుగా ఆదేశాల్నిన్యాయశాఖకు.. లోక్ పాల్ లను ఇవ్వాలని కోరుతున్నారు. మరి.. ఆయన పిల్ పై సుప్రీం ఎలా స్పందిస్తున్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.