Begin typing your search above and press return to search.

మీ పై ఒక్క కేసు లేదు ..మీరు లీడర్స్ అంటే ఎలా నమ్మాలి !

By:  Tupaki Desk   |   26 Nov 2019 6:29 AM GMT
మీ పై ఒక్క కేసు లేదు ..మీరు లీడర్స్ అంటే ఎలా నమ్మాలి !
X
సాధారణంగా రాజకీయాలలో కొనసాగాలి అంటే డబ్బు బలంతో పాటుగా బుద్ది బలం కూడా ఉండాలి. ఒక్క డబ్బు బలం ఉన్నా కూడా ఎందుకు పనికిరాదు. ప్రజలకోసం నడిరోడ్డుపైకి వచ్చి పోరాటం చేసే సత్తా ..ఆ పోరాటంలో ఎవరినైనా ఎదిరించి మాట్లాడగలిగే దమ్ము దైర్యం ఉండాలి. అలాంటివారి ప్రజా నాయకుడిగా గుర్తింపబడి ..పార్టీలోనూ , రాష్ట్ర రాజకీయాలలోని కీలకనేతగా మారతారు. కానీ , కొంతమంది మాత్రం మాకు మేమే గొప్ప నాయకులం అని ఫీల్ అవుతుంటారు. ఆలా ఎవరికీ వారు గొప్ప నాయకులం అనుకుంటే ప్రజాక్షేత్రంలో ఎక్కువ రోజులు ఉండలేరు .. గొప్ప నాయకుడురా అని ప్రజలు ఎవరిని అంటారో వారే ఎక్కువ కాలం పాటు రాజకీయాలలో ఉంటారు.

ఇకపోతే ప్రస్తుతం తెలంగాణ బీజేపీ నేతల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. చేసేది తక్కువ ..చెప్పేది ఎక్కువ. దీనిపై తాజాగా బీజేపీ అధిష్టానం కొంచెం ఆగ్రహం వ్యక్తం చేయడంతో ..ఇప్పుడు అర్జెంటుగా అధిష్టానం ఏదైతే తమనుండి కోరుకుంటుందో అది చేసి , మార్కులు కొట్టేయాలని చూస్తున్నారు. ఇంతకీ బీజేపీ నేతలకి అధిష్టానం ఏ విషయంలో షాక్ ఇచ్చింది? దానికి నేతలు ఇప్పుడు ఏంచేయబోతున్నారు?

బీజేపీ ..ప్రస్తుతం కేంద్రంలో తిరుగులేని శక్తిగా మారిపోయింది. కాంగ్రెస్ చిన్న చిన్నగా తన ఉనికి కోల్పోతూ వస్తుంది.ఇటువంటి తరుణంలో బీజేపీ దక్షణ భారతదేశం లో పాగా వేయాలని ఆలోచిస్తోంది. ఒక్క కర్ణాటకలో తప్ప .దక్షిణాన మిగిలిన ఏ రాష్ట్రంలో కూడా బీజేపీ అంతగా ప్రభావం చూపించలేకపోతుంది. కాస్తో కూస్తొ బీజేపీ హావ కొనసాగేది ఒక్క తెలంగాణ లోనే ..ఈ నేపథ్యంలోనే తెలంగాణలో వచ్చే ఎన్నికల నాటికీ బీజేపీ ఒక బలమైన పార్టీగా ఎదగాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ పర్యటనకి ఇప్పటికే ఎంతో మంది కేంద్రం నుండి వచ్చి వెళ్తున్నారు. అలాగే ఇక్కడి పరిస్థితులని అధిష్టానానికి చేరవేస్తున్నారు.

ఈ మద్యే బిజెపి అధిష్టానం దూతలుగా సునీల్ ధియోరా లాంటి నేతలు తెలంగాణ జిల్లాల్లో పర్యటించి వెళ్ళారు. రాష్ట్ర స్థాయితోపాటు.. వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ పాత జిల్లాల స్థాయిలో పార్టీ శ్రేణులతో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన అడిగిన ఓ ప్రశ్న తెలంగాణ బీజేపీ నేతలకి షాక్ ఇచ్చింది అని తెలుస్తుంది. ఇంతకీ అయన అడిగిన ప్రశ్న ఏమిటి అంటే .. ఒక్కో నేత మీద ఎన్ని పోలీసు కేసులున్నాయని ఆయన ప్రశ్నించారంట. దీనితో ఒకరిద్దరు మినహా తమపై కేసులేమీ లేవని, అది తమ గొప్పతనం అన్నట్లుగా చెప్పుకున్నారంట.

దీనితో వెంటనే అయన మాట్లాడుతూ ..మీపై ఒక్క కేసు కూడా లేదు అంటే ..మీరు ప్రభుత్వం పై ఎలా పోరాడుతున్నారో అర్థం అవుతుంది అంటూ బీజేపీ నేతలకి షాక్ ఇచ్చారు. ఢిల్లీ కి వచ్చినప్పుడు మేము అది చేసాం , మేము ఇది చేసాం అని గొప్పలు చెప్పుకుంటారు కదా మీరు అన్ని పోరాటాలు నిజంగా చెసింటే మీపై ఒక్క కేసు అయినా ఉండాలి కదా అని అనేసరి నేతల నోట్లో నుండి మాట రాలేదని తెలుస్తుంది. దీనితో వెంటనే ప్రభుత్వం పై భారీ పోరాటానికి సిద్దమౌతున్నట్టు సమాచారం. మరి ఏ విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడబోతున్నారో తెలియాలి అంటే వేచి చూడాలి. అనవసరంగా ఆర్టీసీ లాంటి మంచి సమస్యని గాలికి వదిలేశాం అని కొందరు భాదపడుతున్నాట్టు తెలుస్తోంది.