Begin typing your search above and press return to search.
కారు దహనం కేసులో కీలక మలుపు: వివాహేతర సంబంధమేనా..?
By: Tupaki Desk | 11 Aug 2021 2:42 PM ISTమెదక్ జిల్లాలో జరిగిన కారు దహనం కేసు కలకలం రేపుతోంది. ఇందులో ఓ మృతదేహం బయటపడడంతో అది బీజేపీ నేత శ్రీనివాస్ దేనని గుర్తించారు. ముందుగా పోలీసులు ఆ మృతదేహం ఆనవాళ్లను గుర్తించి కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే అతని భార్య ముందుగా తన భర్తది కాదని చెప్పి ఆ తరువాత మాట మార్చింది. ఈ మృతదేహం తన భర్తదేనని ఒప్పుకుంది. అయితే ముందుగా కారు ప్రమాదం అనుకున్న పోలీసులు ఆ తరువాత అందులో మృతదేహాన్ని పరిశీలించిన తరువాత హత్యగా భావించారు. ఆ తరువాత తన భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసుకున్నారు. సోమవారం రాత్రి సమయంలో ఈ దహనం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు.
మెదక్ జిల్లాలోని మంగళపర్తి గ్రామ శివారులోని ప్రధాన రహదారిపై సోమవారం రాత్రి ఓ ఆటో డ్రైవర్ అటు వైపు వెళ్తున్నాడు. అక్కడ ఓ వాహన కాలిపోతుండడం గుర్తించాడు. ఆటోడ్రైవర్ తన స్నేహితుడితో కలిసి నర్సాపూర్ నుంచి వస్తున్నాడు. ఈ క్రమంలో కారు దహనమైన దృశ్యాన్ని అతడు సెల్ ఫోన్లో చిత్రీకరించాడు. అదే రాత్రి ఆ వీడియోను వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశాడు. ఈ వీడియో స్థానిక సర్పంచ్ రామకృష్ణరావు వరకు చేరడంతో ఆయన పోలీలసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో వెల్దుర్ది ఎస్ ఐ మహేందర్ సంఘటన స్థలానికి తన సిబ్బందితో కలిసి వచ్చాడు.
కారు దహనమైన ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించారు. అలాగే కారును మొత్తం తనిఖీ చేయగా అందులో ఓ మృతదేహం కనిపించింది. ఆ మృతదేహం కారు ఢిక్కీలో ఉండడాన్ని గమనించారు. మృతదేహం పూర్తిగా కాలిపోయి గుర్తు పట్టకుండా మారింది. అయితే పోస్టు మార్టం కోసం పోలీసులు ఆసుపత్రి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి వచ్చిన వైద్య సిబ్బంది సంఘటనా స్థలంలోనే పోస్టు మార్టం నిర్వహించారు. ఈ క్రమంలో వైద్యులు పెట్టుడు దంతాలను గుర్తించారు. వీటితో పాటు కారు నెంబర్ రిజిస్ట్రేషన్ ఆధారంగా బీజేపీ నేత శ్రీనివాస్ గా పోలీసులు గుర్తించారు. ఆ తరువాత కుటుం సభ్యులకు సమాచారం ఇచ్చారు. అయితే మొదట ఆ మృతదేహం తన భర్తది కాదని చెప్పిన హైందవి ఆ తరువాత ఒప్పుకుంది. పెట్టుడు పళ్లు గుర్తించిన తరువాత తన భర్తకు పెట్టుడు పళ్లు ఉన్నాయని తెలిపింది. దీంతో పోలీసులు శ్రీనివాస్ దేనని కన్ఫామ్ చేశారు.
ఆ తరువత శ్రీనివాస్ భార్య హైందవి తమ ఇంట్లో వివాహేతర సంబంధాలపై తరుచూ గొడవలు జరుగుతూ ఉండేవని, ఇద్దరు మహిళలతో తన భర్తకు అక్రమ సంబంధం ఉందని పోలీసులకు తెలిపింది. వాళ్లే హత్య చేసి ఉంటారని పోలీసులకు ఇచ్చిన లిఖిత పూర్వక ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలో వెల్దుర్తి మండల పరిధిలోని మారెపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ హత్య ఉదంతాన్ని త్వరలో ఛేదిస్తామని డీఎస్పీ కిరణ్ కుమార్ తెలిపారు. హంతకులను పట్టుకోవడానికి నాలుగు బృందాలను ఏర్పాటు చేశామన్నారు.
సోమవారం రాత్రి నుంచి శ్రీనవాస్ ఫోన్ స్విచ్ఛాఫ్ కావడంతో ఆ రాత్రి 10.30 గంటలకు ఈ హత్య జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. లేదా శ్రీనివాస్ ను ఎక్కడో హత్య చేసి కారులో తీసుకొచ్చి ఇక్కడ దహనం చేశారని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. మెదక్ ఏఎస్పీ కృష్ణమూర్తితో పాటు క్లూస్ టీం సంఘటనా స్థలంలో వివరాలు సేకరించింది. ఇక మరో కోణంలో శ్రీనివాస్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండేవాడని, ఒకవేళ ఆ వ్యాపారంలో ఏమైనా గొడవలు జరిగి హత్య చేశారా..? అని కూడా అనుమానిస్తున్నారు. మొత్తానికి అతి తొందర్లోనే ఈ కేసును ఛేదిస్తామని పోలీసులు తెలుపుతున్నారు.