Begin typing your search above and press return to search.

టీడీపీ బెదిరించింది... ఇవిగో సాక్ష్యాలు

By:  Tupaki Desk   |   30 July 2018 6:17 PM GMT
టీడీపీ బెదిరించింది... ఇవిగో సాక్ష్యాలు
X
కొంత‌కాలం క్రితం వ‌ర‌కు ఎవ‌రికీ పెద్ద‌గా తెలియ‌ని పేరు జీవీఎల్ న‌ర‌సింహారావు. ఆయ‌న పొలిటిక‌ల్ స‌ర్కిల్లో అంద‌రికీ తెలిసినా... జ‌నాల‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం లేదు. అయితే, టీడీపీ-బీజేపీ బంధం తెగిపోయాక‌... టీడీపీ నేత‌లను త‌న మాటల‌తో ఒక ఆట ఆడుకున్న జీవీఎల్ ఠ‌క్కున అంద‌రికీ ప‌రిచ‌యం అయిపోయారు. టీడీపీ నేత‌లు ప్ర‌త్యేక హోదా విష‌యంలో ప్ర‌వ‌ర్తించిన తీరును చ‌రిత్ర ఉదాహ‌ర‌ణ‌లు త‌వ్వి తీసి ఎండ‌గ‌ట్టారు. జీవీఎల్ పుణ్య‌మా అని తెలుగు త‌మ్ముళ్లు కొన్ని నిద్ర‌లేని రాత్రులు గ‌డిపారు.

సుమారు వారం క్రితం పార్ల‌మెంటులో టీడీపీ చేసిన వ్యాఖ్య‌లు - ప్ర‌సంగాల్లోని ప్ర‌తి మాట‌ను స‌వివ‌రంగా ఎండ‌గ‌ట్టిన జీవీఎల్ బీజేపీ ప‌రువును కాపాడ‌ట‌మే కాకుండా టీడీపీ ఎంపీల బేల త‌నాన్ని అంద‌రికీ చూపించారు. రాష్ట్రానికి న్యాయం కోసం పోరాటం చేస్తామ‌ని చెప్పే తెలుగుదేశం ఏ మాట‌లోనూ నిజాయితీ లేదంటూ జీవీఎల్ పార్ల‌మెంటులో ఎండ‌గ‌ట్టిన తీరుతో టీడీపీ బ‌జారున నిల‌బడిన‌ట్టు అయ్యింది. దీంతో తెలుగు త‌మ్ముళ్లు జీవీఎల్‌ పై తీవ్ర ఆగ్రహంతో ర‌గిలిపోతున్నారు. ఇది బ‌హిరంగంగా బ‌య‌ట‌పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి మ‌రీ జీవీఎల్‌కు వార్నింగ్స్ ఇచ్చారు.

దీనిపై చాలా చాక‌చ‌క్యంగా స్పందించిన జీవీఎల్ న‌ర‌సింహారావు టీడీపీ తిట్లు - వార్నింగుల‌తో కూడిన‌ క్లిప్లింగుల‌ను ట్యాగ్ చేస్తూ టీడీపీ సభ్యుల‌పై స‌భా హ‌క్కుల నోటీసు ఇస్తూ రాజ్యసభ కార్యదర్శికి అందించారు. త‌నను టీడీపీ స‌భ్యులు బెదిరించార‌ని, అన‌రాని మాట‌లు అన్నార‌ని అందులో పేర్కొన్నారు. ఒక ఎంపీ విష‌యంలో గాని, ఒక సామాన్య మానవుడిని గాని దూషించ‌ని విధంగా దూషించార‌ని... దానికి త‌గిన సాక్ష్యాధారాలు స‌మ‌ర్పిస్తున్న‌ట్లు ఆయ‌న అందులో పేర్కొన్నారు. జీవీఎల్ చ‌ర్య‌తో టీడీపీ ఎంపీలు షాక్ తిన్నారు.

కొస‌మెరుపు- జీవీఎల్ చెప్పింది అంతా బాగుంది గాని ఆయ‌న ఇచ్చిన నోటీసులో జులై తేదీ ఇవ్వాల్సింది పోయి ఆగ‌స్టు తేదీ ఇచ్చేశారు. దీన్ని ప‌ట్టుకున్న ఒక నెటిజ‌న్ జ‌నాల ప‌న్నులతో పెద్ద పెద్ద జీతాలు తీసుకుంటూ ఒక స్కూలు పిల్లాడు కూడా చేయ‌ని త‌ప్పులు చేస్తే ఎలా అంటూ ట్విట్ట‌రులో ఆయ‌న రిప్ల‌యి పెట్టారు. దానిపై జీవీఎల్ స్పందించ‌లేదు.