Begin typing your search above and press return to search.
ప్రియాంక మీద చేతులు వేయటానికి ఎంత ధైర్యం.. కడిగేసిన బీజేపీ మహిళా నేత
By: Tupaki Desk | 5 Oct 2020 1:40 PM ISTఅధికారం లేకపోతే చాలు.. ఎంతటి అత్యున్నత స్థానాల్లో ఉన్న వారైనా సరే.. వారి పట్ల కొందరు పోలీసులు వ్యవహరించే తీరు ఎప్పుడూ వివాదాస్పదంగానే ఉంటుంది. తాజాగా ఊహకు కూడా అందని రీతిలో చోటు చేసుకున్న పరిణామం యావత్ దేశ ప్రజల్ని అవాక్కు అయ్యేలా చేసింది. కాంగ్రెస్ కీలక నేతల్లో ఒకరైన రాహుల్ గాంధీని ఈడ్చేయటం.. కిందపడేసేలా చేసిన వైనం మింగుడుపడని రీతిలో ఉంటే.. దానికి కొనసాగింపు అన్నట్లుగా ప్రియాంకా గాంధీపై ఒక మగ పోలీసులు చేయి వేసిన వైనం ఏ మాత్రం జీర్ణించుకోలేని పరిస్థితి.
అత్యుత్తమ స్థాయి నేతలకే పోలీసుల కారణంగా ఇలాంటి పరిస్థితి ఏర్పడితే.. న్యాయం కోసం రోడ్డు మీదకు వచ్చిన సామాన్యుల పరిస్థితి ఏమిటి? అన్నది ప్రశ్న. ఈ మొత్తం ఎపిసోడ్ లో అంతో ఇంతో ఉపశమనం ఏమైనా ఉందంటే.. పోలీసుల చర్యను అధికార పార్టీకి చెందిన మహిళా నేత తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రియాంక గాంధీ పట్ల అనుచిత చర్యకు పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలు చిత్రా వాఘ్ మండిపడ్డారు.
మహిళా నాయకురాలి దుస్తులపై మగ పోలీసులు చేయి వేయటానికి ఎంత ధైర్యం? పోలీసులు వారి హద్దులు తెలుసుకోవాలి. భారత సంప్రదాయాలపై నమ్మకం ఉన్న యోగి ఆదిత్యనాథ్.. ఈ ఘటనలో పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని సొంత పార్టీకి చెందిన చిత్రా నిప్పులు చెరిగారు. హాథ్రస్ ఘటనపై న్యాయానికి ప్రియాంక చూపిస్తున్న చొరవను ఆమె కొనియాడారు.
ఇదిలా ఉంటే.. ప్రియాంక దుస్తులపై చేయి వేసిన ఉదంతంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న గౌతమ్ బుద్ధ నగర్ పోలీసులు తాజాగా కాంగ్రెస్ నాయకురాలికి క్షమాపణలు తెలిపారు. బాధితురాలిని పరామర్శించేందుకు వెళుతున్న ప్రియాంక దుస్తులపైనా.. ఒంటి మీదా చేయి వేసిన పురుష పోలీసుల తీరుపై సర్వత్రా విమర్శలు రావటంతో.. ఈ వ్యవహారంపై విచారణకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రత్యర్థి పార్టీకి చెందిన మహిళా నేత అయినప్పటికీ.. ప్రియాంక పట్ల దురుసుగా వ్యవహరించిన వైనాన్ని ఖండిస్తూ బీజేపీ మహిళా నేత స్పందించటం మంచిదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.