Begin typing your search above and press return to search.

గోల్కొండ సింహం..ఓవైసీల ప్ర‌త్య‌ర్థి క‌న్నుమూత‌

By:  Tupaki Desk   |   23 Feb 2019 2:42 PM GMT
గోల్కొండ సింహం..ఓవైసీల ప్ర‌త్య‌ర్థి క‌న్నుమూత‌
X
`గోల్కొండ సింహం`గా సుప‌రిచితుడు అయిన బీజేపీ సీనియర్ నేత - కార్వాన్ మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌ రెడ్డి(73) కన్నుమూశారు. బంజారాహిల్స్‌ లోని కేర్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈనెల 10 నుంచి ఆయనకు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. బాల్‌ రెడ్డి గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కేర్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. బాల్‌ రెడ్డి భౌతికకాయాన్ని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న ఆయన నివాసానికి తరలించారు. రేపు మధ్యాహ్నం 2 గంటల వరకు బాల్‌ రెడ్డి భౌతికకాయాన్ని తన స్వగృహంలో ఉంచనున్నారు. అనంతరం బీజేపీ కార్యాలయానికి తరలించనున్నారు. కార్యకర్తల కడచూపు కోసం బీజేపీ కార్యాలయంలో సాయంత్రం వరకు బాల్ రెడ్డి భౌతికకాయాన్ని ఉంచుతారు. బీజేపీ కార్యాలయం నుంచి మహాప్రస్థానం వరకు ఆయన అంతిమ యాత్ర కొనసాగనుంది. సాయంత్రం మహాప్రస్థానంలో బాల్ రెడ్డి అంత్యక్రియలను ఆయన కుటుంబ సభ్యులు నిర్వహిస్తారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు జూబ్లీహిల్స్‌ లోని మహాప్రస్థానంలో బాల్‌ రెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి.

1945 మార్చి 7న బాల్‌ రెడ్డి పాతబస్తీలోని అలియబాద్‌ లో జన్మించారు. ఆయనకు నలుగురు కుమారులు - ఒక కుమార్తె ఉన్నారు. 1962లో బద్దం.. జనసంఘ్‌ లో చేరారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. పాతబస్తీలోని అలియబాద్‌ లో 55 ఏళ్లు నివాసమున్నారు. 2000 సంవత్సరంలో బాల్‌ రెడ్డి బంజారాహిల్స్‌ కు తన నివాసాన్ని మార్చారు. 1985 - 1989 - 1994లో వరుసగా మూడు సార్లు కార్వాన్ ఎమ్మెల్యేగా బాల్‌ రెడ్డి గెలుపొందారు. పాత‌బ‌స్తీ త‌మ ఇలాకాగా పాలిస్తున్న ఎంఐఎం నేత‌ల‌కు బాల్ రెడ్డి సింహ‌స్వ‌ప్పంగా నిలిచి కార్వాన్ నుంచి గెలుపొందారు. బీజేపీ నేత‌ల్లో ఆలె న‌రేంద్ర టైగ‌ర్ న‌రేంద్ర‌గా పేరొంద‌గా... బాల్‌రెడ్డి `గోల్కొండ సింహం`గా సుప‌రిచితుడు.