Begin typing your search above and press return to search.

ఒక్క పోస్టు బీజేపీ లీడరును జైలుకు పంపింది

By:  Tupaki Desk   |   11 May 2019 8:15 PM IST
ఒక్క పోస్టు బీజేపీ లీడరును జైలుకు పంపింది
X
బీజేపీ ఆటలు ఎక్కడయినా సాగుతాయోమో గానీ వెస్ట్ బెంగాల్ లో సాగవు. ఇప్పటికే మమత కోటలో ప్రవేశానికి మోడీ చేసిన అనేక ప్రయత్నాలు బెడిసి కొట్టాయి. ఇక్కడ జీవీఎల్ వంటి వారు ఎంత పెద్ద తిట్లు తిట్టినా సీఎం ఏమీ చేసే పరిస్థితుల్లో లేరు. అయితే బెంగాల్లో అలా కాదు. తిక్క వేషాలేస్తే జైలే గతి అని మరోసారి నిరూపించింది బెంగాల్ ఐరన్ లేడీ మమతా బెనర్జీ.

ఇంతకీ ఏం జరిగిందంటే... తాజాగా బీజేపీ మహిళా నేత ఒకరు మమతా బెనర్జీ ఫొటోను మార్ఫింగ్ చేసింది. అంతటితో ఊరుకోలేదు. ఏకంగా తన సోషల్ మీడియాలో ఫోస్ట్ చేసింది. ఇటీవలే అమెరికాలో జరిగి మెట్ గాలా ఈవెంట్ లో ప్రియాంక చోప్రా విచిత్ర వేషధారణ ఫొటో ఉంది కదా... ఆ ఫొటోకి మమత మొహం పెట్టి ఫన్ అంటూ ఆమె పోస్టు చేసింది. దీనిని నిబంధనల ఉల్లంఘన కింద భావించిన పోలీసులను ఆమెను అరెస్టు చేసి జైలుకు పంపారు.

సాధారణంగా అది కేవలం తను ప్రైవేటుగా షేర్ చేసుకుని ఉంటే ఈ తిప్పలు తప్పేవేమో గానీ ఫేస్ బుక్ అక్కౌంట్ లో నేరుగా పోస్ట్ చేసేసరికి ఇరుకునపడింది. బెంగాల్ పోలీసులకు మమత అంటే ఎంతయినా అభిమానమే. ఇటీవలే కేంద్రం సీబీఐతో ఓ కేసులో బెంగాల్ పోలీసు అధికారిని అరెస్టు చేయడానికి వస్తే వారి కోసం ఏకంగా అర్ధారత్రి ధర్నాకు దిగారు మమత. మరి ఆ మాత్రం కృతజ్క్షత ఉంటుందిగా పోలీసుల్లో. పైగా ఇంకా సీఎంగా ఆమె టెర్ము ముగియలేదు. అక్కడ కేవలం లోక్ సభ ఎన్నికలు మాత్రమే జరుగుతున్నాయి.