Begin typing your search above and press return to search.

అమ్మాయిలు..బాయ్‌ ఫ్రెండ్ లేకుంటేనే బాగుంటారు!

By:  Tupaki Desk   |   26 March 2018 10:11 AM GMT
అమ్మాయిలు..బాయ్‌ ఫ్రెండ్ లేకుంటేనే బాగుంటారు!
X
ఇండియాలో పుట్టి పెరిగి - ఇక్కడ కీర్తి ప్రతిష్టలు - డబ్బు సంపాదించుకుని ఇటలీలో వివాహం చేసుకోవడమేంటి? అని ప్రశ్నించడ‌మే కాకుండా విరాట్ కోహ్లీ దేశభక్తుడు కాదని వ్యాఖ్యానించిన ఎమ్మెల్యే గుర్తున్నారా? ఆయ‌నే మధ్యప్రదేశ్ రాష్ర్టానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే పన్నాలాల్ శఖ్యా. తాజాగా అలాంటి వ్యాఖ్యే మ‌రోమారు చేశారు శఖ్యా.అయితే ఈ ద‌ఫా ఆయ‌న అమ్మాయిల‌కు సూచ‌న‌లతో కూడా హెచ్చ‌రిక చేశారు. అమ్మాయిలు పూర్తి రక్షణతో ఉండాలంటే బాయ్‌ ఫ్రెండ్స్‌ ను దూరంపెట్టాలని అమ్మాయిలకు బీజేపీ ఎమ్మెల్యే సలహా ఇచ్చారు.

గునా ప్రభుత్వ కాలేజీలో నిర్వహించిన ఓ కార్యక్రమానికి హాజరైన బీజేపీ ఎమ్మెల్యే అమ్మాయిలను ఉద్దేశించి `ఆడపిల్లలకు బాయ్‌ ఫ్రెండ్స్ ఎందుకు? బాయ్‌ ఫ్రెండ్స్ కారణంగానే వారిపై దురాగతాలు పెరిగిపోతున్నాయి` అని అన్నారు. బాయ్‌ ఫ్రెండ్స్‌ తో తిరగడం మానేస్తే అమ్మాయిలకు పూర్తి రక్షణ వస్తుందని పన్నాలాల్ సూచించారు. అబ్బాయిలు పాశ్చాత్య మోజులో పడి గర్ల్‌ఫ్రెండ్స్‌ను చేసుకునే అలవాటును మానుకోవాలని పన్నాలాల్ సెలవిచ్చారు. కేవ‌లం అమ్మాయిలనే కాదు అబ్బాయిలను సైతం ఎమ్మెల్యే మందలించారు. గర్ల్ ఫ్రెండ్స్‌ ను ఏర్పరుచుకోవడం పాశ్చాత్య సంస్కృతి అని చెప్పారు. అలాగే అంతర్జాతీయ మహిళా దినోత్సవం అనేది కూడా విదేశీయుల సాంప్రదాయమని పేర్కొన్నారు. భార‌తీయ యువ‌తీ, యువ‌కులు మ‌న సంస్కృతి, సంప్ర‌దాయాల‌ను గౌర‌వించి న‌డుచుకోవాల‌ని కోరారు.