Begin typing your search above and press return to search.
బీజేపీ, జనసేన, నాదెండ్ల-పురందేశ్వరి, ఏం కాంబినేషన్!
By: Tupaki Desk | 9 March 2020 11:09 AM ISTఎన్టీఆర్ కూతురు, నాదెండ్ల భాస్కర్ రావు కొడుకు.. భారతీయ జనతా పార్టీ, జనసేనల పొత్తు ప్రయాణం గురించి చర్చించి నేతల్లో ముందు వరసలో ఉన్నారు! వీళ్లిద్దరి ఫొటో తో బీజేపీ, జనసేన స్థానిక ఎన్నికల పొత్తు వార్త ప్రింట్ మీడియాలో ప్రచురితం అయ్యింది! ఈ కాంబినేషన్ ఎందుకు ప్రత్యేకమో వివరించనక్కర్లేదు. ఈ మధ్యనే ఎన్టీఆర్ బయోపిక్ లో కూడా నాదెండ్ల భాస్కర్ రావునే విలన్ ను చేసి చూపించారు. అందుకు ప్రతిగా ఆయన యూట్యూబ్ చానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఎన్టీఆర్ బయోపిక్ రెండో పార్టును చూసిన వాళ్ల కన్నా యూట్యూబ్ లో నాదెండ్ల భాస్కర్ రావు ఇంటర్వ్యూలనే ఎక్కువమంది వీక్షించి ఉండవచ్చు!
గతంలో దగ్గుబాటి పురందేశ్వరి కాంగ్రెస్ నేతగా చలామణి అయ్యారు. ఆ సమయంలో నాదెండ్ల మనోహర్ కూడా కాంగ్రెస్ నేతగానే ఉండేవారు. అయితే అప్పుడు కూడా వీళ్లు కలిసి ఎక్కడా ఒకే వేదిక మీద అంతగా కనిపించే వారు కాదు! ఇప్పుడు మాత్రం నందమూరి-నాదెండ్ల కాంబో కనిపించింది.
ఇక జనసేన, బీజేపీ పొత్తు గురించి చర్చోప చర్చలు చేసి, స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను రచించిన అపర నేతల్లో కామినేని శ్రీనివాస్, శనక్కాయల అరుణ, ఆదినారాయణ రెడ్డి వంటి వాళ్లున్నారట! వీరిలో ఒక్కోరిది ఒక్కో హిస్టరీ. మొత్తానికి జనసేన- బీజేపీ కాంబినేషన్ లో నేతల కాంబినేషన్ మాత్రం భలే కుదిరినట్టుగా ఉంది.