Begin typing your search above and press return to search.
గవర్నర్ తో బీజేపీ-జనసేన నేతల భేటి.. వీటిపై వినతి
By: Tupaki Desk | 28 Jan 2021 5:32 PM ISTపంచాయితీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ-జనసేన ముఖ్య నేతలు ఈరోజు గవర్నర్ హరిచందన్ ను కలిసి ఫిర్యాదు చేశారు. ఏపీ ప్రభుత్వానికి, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కు మధ్య జరుగుతున్న పోరుపై రాజ్ భవన్ కు వెళ్లి బీజేపీ-జనసేన నేతలు సోము వీర్రాజు, నాదెండ్ల మనోహర్ గవర్నర్ కు వివరించారు. ఏపీలో స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.
గవర్నర్ తో భేటి అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ గతంలో అరాచకాలకు పాల్పడిందని.. ఈసారి అలా జరగకూడదని గవర్నర్ ను కోరారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికలు జరిగేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని గవర్నర్ కు విన్నవించారు.
ఆలయాలపై దాడుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సోము వీర్రాజు ఆరోపించారు. రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొడుతోందన్నారు. చర్చి, ఫాదర్ లకు ప్రజాధనం ఎందుకు పంచుతోందని ప్రశ్నించారు. ఆన్ లైన్ నామినేషన్ విధానం అమలు చేయాలని గవర్నర్ ను కోరారు.
జనసేన నేత నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్తితులు గవర్నర్ కు వివరించామన్నారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకున్న చరిత్ర వైసీపీకి ఉందని.. ఈసారి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా చూడాలని గవర్నర్ ను కోరామన్నారు. ఏకగ్రీవాల పేరుతో భయపెట్టి ప్రలోభ పెట్టాలని చూస్తున్నారని నాదెండ్ల ఆరోపించారు.