Begin typing your search above and press return to search.
దేశంలో రెండో శక్తిమంతమైన పార్టీగా బీజేపీ...కారణమిదే
By: Tupaki Desk | 4 Dec 2020 5:00 AM IST130 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ 2014 నుంచి డీలాపడుతూ వస్తోన్న సంగతి తెలిసిందే. అదే సమయంలో 2014 నుంచి దేశంలో బీజేపీ బలపడుతూ వస్తోంది. బీజేపీ పుంజుకోవడానికి ప్రధాని మోడీ చరిష్మా ఒక కారణమైతే...బలమైన సిద్ధాంతాలుండడం, వాటిని అనుసరించే కార్యకర్తలుండడం మరొక కారణం. 2024 ఎన్నికల్లో బీజేపీని కొట్టే పార్టీ...మోడీని ఢీకొనే నాయకుడు లేరన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, బీజేపీ ఇంత తక్కువ సమయంలో అంత బలపడేందుకు కారణాలేమిటన్నదానిపై చర్చ జరుగుతోంది. కేవలం పార్టీలో ఐక్యతే బీజేపీ విజయ రహస్యం అన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ, హిందుత్వ సంస్థల సహాయ సహకారాలతో మోడీ హవా సాయంతో 2014 తర్వాత దేశంలోనే రెండో అత్యంత శక్తిమంతమైన పార్టీగా అవతరించిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆధ్వర్యంలోని కాంగ్రెస్‌ను తొలి శక్తిమంతమైన పార్టీ వ్యవస్థగా రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇందిరాగాంధీ తర్వాత ఆ రేంజ్ ప్రజాదరణ కలిగిన నాయకుడు మోడీనే అని అభిప్రాయపడుతున్నారు.
మోడీ ఇమేజ్, హిందుత్వ ఎజెండా, అతివాద జాతీయవాదం, ఇస్లామోఫోబియా, బలహీన ప్రతిపక్షం...ఇవన్నీ వెరసి బీజేపీ మునుపెన్నడూ లేనంత శక్తిమంతంగా తయారైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బీజేపీకి ‘‘అపారదర్శక’’ నిధుల వెల్లువ విపరీతంగా పెరిగిందని, అనేక మీడియా సంస్థలు కూడా బీజేపీకి గట్టి మద్దతు ప్రకటించడం మరోకారణంగా చెబుతున్నారు. ఆర్ఎస్ఎస్, వీహెచ్ పీ, హిందుత్వ సంస్థల మద్దతు బీజేపీకి మెండుగా ఉండడంతో ఆ సంస్థలతోపాటు హిందుత్వ ఎజెండాకు ఆకర్షితులైన వారంతా బీజేపీకి సాలిడ్ ఓటు బ్యాంకుగా మారారని అంటున్నారు.
వాజ్‌పేయీ, అడ్వాణీ.. తరహాలో మోడీ, షాల జోడీ ఆర్‌ఎస్‌ఎస్ మద్దతుతో పార్టీని ఐక్యతతో నడిపించగలుగుతున్నారని చెబుతున్నారు. ఆ సంస్థలే తమ కార్యకర్తలను వేరే పార్టీలకు వెళ్లకుండా చూస్తుంటారని అంటున్నారు. ఒక వేళ బీజేపీ అసమ్మతివాదులు బయటకు వెళ్లినా...కొన్నాళ్లకు మళ్లీ పార్టీలోకి వచ్చేస్తారని, సైద్ధాంతిక విభేదాలే అందుకు కారణమని అంటున్నారు. అయితే, వేరే పార్టీల నుంచి బీజేపీలో చేరేవారు బీజేపీ సిద్ధాంతాలతో విభేదించకుండా ఎంతకాలం మనగలరన్నది ఆసక్తికరంగా మారిందని అంటున్నారు. ఇప్పటికీ బీజేపీలో పెద్ద పదవులు ఆధిపత్య కులాల వారికే కట్టబెట్టారన్న వాదన ఉందని, దానిని బీజేపీ పరిష్కరించాల్సిన అవసరముందని అంటున్నారు.