Begin typing your search above and press return to search.
బ్లాక్ మెయిల్ పాలిటిక్స్... అవుట్ డేటెడ్ ట్రిక్స్ ?
By: Tupaki Desk | 29 Dec 2021 9:00 PM ISTబీజేపీ కేంద్రంలో ఏడేళ్లుగా అధికారంలో ఉంది. ఇపుడున్న సీన్ చూస్తూంటే మరో మారు అధికారంలోకి ఏదో విధంగా రావడం ఖాయమన్న అంచనాలు ఉన్నాయి. దాంతోనే బీజేపీ ధోరణిలో మార్పు కనిపిస్తోంది అంటున్నారు. కేంద్రంలో దశాబ్దాల తరబడి అధికారం చలాయించిన కాంగ్రెస్ ఎన్నో జాఢ్యాలు వంటబట్టించుకుంది. నాడు వ్యవస్థలను గుప్పిట పట్టి రాజకీయ ప్రత్యర్ధుల మీద ప్రయోగించడం, దారికి రాని వారి మీద సీబీఐ ఆయుధాన్ని ప్రయోగించడం వంటివెన్నో కాంగ్రెస్ చేసి అభాసుపాలు అయింది.
గవర్నర్లను, రాజ్ భవన్లను కూడా తనకు అనుకూలంగా చేసుకుని రాజకీయ రాక్షస క్రీడకు తెరలేపింది. ఫలితంగా కాంగ్రెస్ విధానాలు గబ్బు కంపు కొట్టి తొలిసారిగా 1977లో ఓడింది. అయినా మారలేదు కనుక మరో పుష్కరానికి రెండవసారి 1989లో కూడా ఓడించేశారు. ఆ తరువాత నుంచి కాంగ్రెస్ కి ఎపుడూ జనాలు ఫుల్ మెజారిటీ ఇవ్వలేదు. లాస్ట్ గా కాంగ్రెస్ కి వచ్చిన బండ మెజారిటీ నాలుగు వందల పై చిలుకు ఎంపీలు అన్నది 1984లో మాత్రమే. అది కూడా ఇందిరాగాంధీ హత్యానంతరం వచ్చిన సానుభూతి మాత్రమే.
ఇది భారతదేశంలో రాజకీయ చరిత్ర. వెనక్కి తిరిగి చూస్తే కనిపించేదేది ఇదే. మరి నాడు విపక్షంలో ఉంటూ కాంగ్రెస్ విధానాలను తూర్పారా పట్టిన బీజేపీ ఈ రోజు దేన్ని అమలు చేస్తోంది అన్నదే ప్రశ్నగా ఉంది. తమకు అధికారం లేని చోట వివక్ష చూపడం, అక్కడ అధికారంలో ఉన్న ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించడం. మెజారిటీ తక్కువగా ఉంటే ప్రత్యర్ధి పార్టీల నుంచి గోడ దూకుళ్ళను ప్రోత్సహించడం ఇలాంటివి అన్నీ బీజేపీ చేస్తూ కాంగ్రెస్ తానులో తాను ఒక ముక్కను అని చెప్పుకుంటోంది. దీనికి కర్నాటక, మధ్యప్రదేశ్ అచ్చమైన ఉదాహరణలు.
ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాల మీద బీజేపీ కన్ను పడినట్లుంది. ఇక్కడ ఏదో విధంగా అధికారంలో రావాలని బీజేపీ చూస్తోంది. అయితే దానిని ఎవరూ తప్పుపట్టారు. ఒక బలమైన జాతీయ పార్టీగా బీజేపీ తన సిద్ధాంతాలను చెప్పుకుని జనాల నుంచి ఓట్లు కోరవచ్చు. వారి దయ ఉంటే అధికారంలోకి రావచ్చు. కానీ బీజేపీ రాజమార్గాన్ని వదిలిపెట్టేసి వేరే రూట్లో రావాలను చూడడమే ఇపుడు చర్చగా ఉంది.
తెలంగాణాలో బీజేపీ నేతలు తరచూ అనే మాట ఏంటి అంటే కేసీయర్ సర్కార్ అవినీతికి పాల్పడింది. కేసీయార్ ఏదో రోజు జైలుకు పోతారు, టీయారెస్ కుటుంబ పార్టీ, ఆ పార్టీకి ప్రజా వ్యతిరేకత ఉంది. ఈసారి ఓడిపోవడం ఖాయమని. ఇలాంటి స్టేట్మెంట్స్ వల్ల జనాలకు అందే సందేశం ఏంటో కమలనాధులకు అర్ధం కాకపోవడమే విచిత్రంగా ఉంది. కేసీయార్ ని జైలుకు పంపుతామని చెబుతున్న బీజేపీ ఆయన ఏ తప్పు చేశారో మాత్రం చెప్పలేకపోతోంది.
నిజంగా కేసీయార్ తప్పు చేస్తే కేంద్రంలో బీజేపీ సర్కార్ ఎందుకు వదిలేస్తోంది అన్నది కూడా పాయింటే కదా. ఇక ఏపీ విషయం తీసుకుంటే తాజాగా బీజేపీ పెట్టిన సభలో కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జావదేకర్ మాట్లాడుతూ జగన్ త్వరలో జైలుకు పోతారు అన్నట్లుగా అర్ధం వచ్చేలా మాట్లాడారు. ఆయన బెయిల్ మీద ఉన్నారు. అది అందరికీ తెలిసిందే. ఆయన కేసులు కోర్టు పరిధిలో విచారణ దశలో ఉన్నాయి. వాటి మీద తీర్పు చెప్పాల్సింది కోర్టులు.
కానీ ప్రకాష్ జావదేకర్ ఎలా తుది తీర్పు చెబుతారు అన్నదే ఇక్కడ ప్రశ్న. కోర్టులో ఉన్న వాటి మీద వ్యాఖ్యానించడం మంచిది కాదు అన్నది ఆయనకి తెలియదా అన్నది కూడా మరో ప్రశ్నగా ఉంది. ఇక ఇక్కడా కుటుంబ పార్టీలు అవినీతి పార్టీలు అంటున్నారు. అవినీతి రాష్ట్రాలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడం కూడా కేంద్రంలోని బీజేపీ తప్పు కాదా అంటే ఏం జవాబు చెబుతారో మరి.
అప్పట్లో చంద్రబాబు సీఎం గా ఉండగా పోలవరం లో అవినీతి జరిగింది అని ఇదే బీజేపీ నేతలు ఆరోపించారు. ఇపుడు అదే చెబుతున్నారు. మరి అవినీతి జరిగింది అని తెలుసు. పైగా పోలవరం జాతీయ ప్రాజెక్టు, కేంద్రం నిధులు ఇస్తోంది. మరి తప్పు జరిగితే ఎందుకు పట్టుకోవడం లేదు అన్నది సామాన్యుడి ప్రశ్న. కేవలం సగటు రాజకీయ నేతగా ఆరోపణలు చేసి వెళ్లిపోవడం అంటే బీజేపీ ఇమేజ్ కే అది డ్యామేజ్ గా ఉంటుంది అన్నది ఎందుకు గుర్తించలేకపోతున్నారు అన్నది ఆలోచించాలి.
ఇక ఇలా ఆరోపణలు చేయడం ద్వారా బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ వ్యూహాన్ని అనుసరిస్తున్నారా అన్న చర్చ కూడా వస్తోంది. అదే నిజమైతే మాత్రం బీజేపీ కూడా కాంగ్రెస్ దారిలోనే వెళ్తోంది అనుకోవాలి. కాంగ్రెస్ ఎన్నో తప్పులు చేసి ఈ రోజు ఏ రకంగా ఉందో చూస్తున్న బీజేపీ అదే రూట్ రైట్ అనుకుంటే ఇక తీర్పు చెప్పాల్సింది ప్రజలే మరి.