Begin typing your search above and press return to search.

టీడీపీ నేత‌లకు బీజేపీ వ‌ల‌.. నిజ‌మేనా..?

By:  Tupaki Desk   |   20 Sep 2022 7:31 AM GMT
టీడీపీ నేత‌లకు బీజేపీ వ‌ల‌..  నిజ‌మేనా..?
X
రాజ‌కీయాల్లో ఏదైనా జ‌ర‌గొచ్చు. పార్టీల‌తో సంబంధం లేదు.. ప‌రిస్థితుల‌తోనూ సంబంధం లేదు. త‌మ రాజ‌కీయ వ్యూహాలు.. ప్ర‌తి వ్యూహాలు నెగ్గుకురావ‌డ‌మే ముఖ్యం. ఇదే సూత్రాన్ని కేంద్రంలోని బీజేపీ అనుస‌రించిందా? 2019 ఎన్నిక‌ల త‌ర్వాత‌.. వ్యూహాత్మ‌కంగా ఏపీపై దృష్టి పెట్టిందా? అంటే.. తాజాగా టీడీపీ మాజీ నాయ‌కుడు. ప్ర‌స్తుత బీజేపీ నేత‌.. సుజ‌నా చౌద‌రి చెప్పిన విష‌యాల‌ను బ‌ట్టి.. ఔన‌నే అంటున్నారు ప‌రిశీల‌కులు. 2019 టీడీపీ ఘోర ఓట‌మిని ఎవ్వ‌రూ ఊహించ‌లేదు.

ఎందుకంటే.. అమ‌రావ‌తి వంటి బ‌ల‌మైన న‌గ‌రాన్ని.. భార‌త్‌కే పేరు వ‌చ్చే మెరుపులాంటి రాజ‌ధానిని ఆయ‌న ప్రాణ ప్ర‌తిష్ఠ చేశారు.దీనికితోడు.. పెట్టుబ‌డులు తెచ్చేందుకు కూడా అనేక వ్య‌య ప్ర‌యాస‌ల‌కు ఓర్చుకున్నారు.

అంతేకాదు.. ఒక‌వైపు.. అభివృద్ధిని కాంక్షిస్తూనే.. మ‌రోవైపు.. సంక్షేమానికి కూడా పెద్ద‌పీట వేశారు. అదేవిధంగా పేద‌ల ఆక‌లి తీర్చే అన్న క్యాంటీన్ల‌ను ఏర్పాటు చేశారు. దీంతో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం గ‌ద్దె దిగ‌డం అంత ఈజీకాద‌ని.. దేశ రాజ‌కీయాల్లోనే ఒకవిశ్లేష‌ణ వ‌చ్చింది.

అయితే.. ఆయ‌న పార్టీ ఓడిపోయింది. ప్ర‌భుత్వం ప‌డిపోయింది. అనంత‌ర కాలంలో.. ఏపీపై బీజేపీ పెద్ద‌లు దృష్టి పెట్టార‌నేది సుజ‌నా వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి అర్ధ‌మ‌వుతుంది. ముఖ్యంగా చంద్ర‌బాబు అంటే గిట్ట‌ని అరుణ్ జైట్లీ వంటి వారు.. ఏపీపై ఆప‌రేష‌న్ క‌మ‌ల్ను ప్ర‌యోగించార‌నేది.. ఆయ‌న మాట‌ల్లో స్ప‌ష్టంగా క‌నిపించింది. ఈ క్ర‌మంలోనే చాలామంది నాయ‌కుల‌ను ఆయ‌న చేర‌దీసి పార్టీలు ఇచ్చి.. పార్టీలు మారేలా ప్రోత్స‌హించారని తెలుస్తోంది.

ఏపీలో టీడీపీ దుంప నాశ‌నం అయిపోతే.. ఆ వెలుగుల్లో క‌మ‌ల వికాసం జ‌రుగుతుంద‌ని.. జైట్లీ అంచ‌నా వేసిన‌ట్టు తెలుస్తోంది. అందుకే .. చాలా మంది నాయ‌కులు.. ఆ పార్టీలో చేరిపోయారు. ఇక‌, మ‌రికొద్ది మంది చేరేందుకు ప్ర‌య‌త్నిస్తే.. తాను వారించాన‌ని.. సుజ‌నా చెప్పుకొచ్చారు.

అయితే.. అప్ప‌టికే.. టీడీపీకి జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింద‌నేది సుజ‌నా వాద‌న‌. ఏదేమైనా.. ఆ ఎఫెక్ట్ ఇప్ప‌టికీ ప‌నిచేస్తోంద‌ని.. టీడీపీ నేత‌ల‌కు గ‌తంలో లేని ప్ర‌త్యామ్నాయ పార్టీ వ‌చ్చిందని ఆయ‌న చెప్పుకొచ్చారు. దీని నుంచి పార్టీని కాపాడుకునేందుకు చంద్ర‌బాబు చాలానే ప్ర‌య‌త్నించార‌నేది వాస్త‌వం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.