Begin typing your search above and press return to search.
టార్గెట్ సౌత్.. కమల వికాసం సాధ్యమేనా...?
By: Tupaki Desk | 8 Jan 2023 8:00 PM ISTఔను.. బీజేపీ కేంద్ర పెద్దలు ఇప్పుడు టార్గెట్ సౌత్ మంత్రాన్ని పఠిస్తున్నారు. ఇప్పటి వరకు ఉత్తరాదిలో విస్తరించిన బీజేపీ పార్టీ ఇక, వచ్చే ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాల్లోనూ తమ సత్తా నిరూపించుకునేందుకు తహతహ లాడుతున్నారు. ఈ ఏడాది తెలంగాణ, కర్ణాటక, వచ్చేఏడాది ఏపీ, ఆ పై ఏడాది కేరళ, తమిళనాడులోనూ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలపై కేంద్ర బీజేపీ పెద్దలు ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్టు డిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
దీనిలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ 2024 సార్వత్రిక ఎన్నిక్లలో తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోని రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతానికి ఏపీపై కంటే తెలంగాణపైనే బీజేపీ పెద్దలు ఎక్కువగా దృష్టి పెట్టారు. ఈ ఏడాది నవంబరు-డిసెంబరు మధ్య తెలంగాణలో జరగనున్న ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
మరీ ముఖ్యంగా తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే లక్ష్యాన్ని ప్రధాని మోడీ,కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలు స్వయంగా భుజాన ఎత్తు కున్నట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. దక్షిణాదిలో విస్తరిస్తారా? లేదా? అనేది పక్కన పెడితే.. ఒక్కసారి బీజేపీ అంటూ.. దృష్టి పెడితే.. ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏదో ఒక రకంగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. తమకు మెజారిటీ తక్కువ వచ్చిన రాష్ట్రాలైన గోవా, కర్ణాటకల్లోనూ ఆపరేషన్ ఆకర్ష్‌లను చేపట్టి.. ప్రభుత్వాలను ఏర్పాటు చేశాయి.
ఇదే పరిణామాలు తెలంగాణలోనూ కనిపిస్తాయని అంటున్నారు పరిశీలకులు. ఇక, ఇదే దూకుడు ఏపీపైనా చూపించే అవకాశం లేకపోలేదని.. అయితే.. దీనికి కొంత సమయంలో పడుతుందని అంటున్నారు. ప్రజల అభీష్టం ఎలా ఉన్నప్పటికీ.. కమల నాథుల కన్ను పడిన రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు ఇరుకునపడిన పరిస్థితిని వారు చెబుతున్నారు. మరి దక్షిణాదిలో ఏం జరుగుతుందో చూడాలి.