Begin typing your search above and press return to search.
బీజేపీ దారుణాలు: రైతులపై యుద్ధానికి ఏం చేస్తోందంటే?
By: Tupaki Desk | 2 Feb 2021 3:40 PM ISTబీజేపీ తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని చేపట్టిన మొన్నటి రైతుల ఆందోళన హింసాత్మకంగా మారింది. రైతులు ట్రాక్టర్లతో దేశ రాజధాని ఢిల్లీపై తండెత్తారు. ఎర్రకోటపై రైతు జెండాను ఎగురవేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ నిరసన మారుమోగింది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ పరువు తీసింది. ఇంత నిరసన తెలిపినా.. కొందరు రైతులు చనిపోయినా కేంద్రంలోని బీజేపీ కరగలేదు..రైతు చట్టాలను రద్దు చేయలేదు.
దీంతో రైతులు మరోసారి పోరుబాట పట్టబోతున్నారు. ఫిబ్రవరి 6న రైతులు మరోసారి దేశవ్యాప్తంగా మహా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. దేశవ్యాప్తంగా రోడ్లను దిగ్భంధించనున్నట్లు రైతు సంఘాల నేతలు ప్రకటించారు. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనని దేశవ్యాప్తంగా సాగుతున్న ఈ ఉద్యమానికి అన్ని రైతు సంఘాలు మద్దతు తెలిపాయి.
అయితే రైతులు ఎంత పకడ్బందీగా ముందుకెళుతుండడంతో పోలీసులు కూడా అంతే దూకుడుగా వ్యూహాలు పన్నుతున్నారు. ఢిల్లీలోకి రైతులు అడుగు పెట్టకుండా తాజాగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నారు.
దేశవ్యాప్తంగా రహదారుల దిగ్బంధానికి సిద్ధమైన రైతు ఉద్యమకారులను నిలువరించేందుకు ఢిల్లీ సరిహద్దుల్లో సిమెంట్, ఇనుప చువ్వలతో మేకులు, ఇనుప బారికడ్లతో రోడ్లపై గట్టిగా నిర్మిస్తున్నారు. రైతులను ఢిల్లీలోకి రాకుండా వస్తే ప్రాణాలు పోయేలా ఇలా కాంక్రీట్ పోతపోసి మరీ పదునైన దిగితే ప్రాణం పోయేలా రోడ్లపై ఏర్పాటు చేశారు. పోలీసుల చేతివేళ్లకు రక్షణగా ఉండేందుకు స్లీల్ తొడుగు, మరో చేతికి డాలును పోలిన తొడుగును ధరిస్తున్నారు.
పోలీసులు సింఘా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన ఇనుపరాడ్లు, కంచెలు, శూలాలు , ఇనుప మొనలతో తాత్కాలిక గోడల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. రోడ్డు దాటితే ప్రాణాలు పోయేలా పోలీసులు ఏర్పాటు చేసిన వైనం చూసి అందరూ షాక్ అవుతున్నారు. రైతులతో యుద్ధం చేస్తారా? వారి ప్రాణాలు తీస్తారా అని నెటిజన్లు మండిపడుతున్నారు.
దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా మంగళవారం ట్విట్టర్ ద్వారా ఘాటు విమర్శలు చేశాడు. 'గోడలను కాదు.. బ్రిడ్జీలను నిర్మించండి' అంటూ బీజేపీ సర్కార్ పై ఘాటు విమర్శలు చేశాడు. రాహుల్ గాంధీ షేర్ చేసిన ఫొటోలు దారుణంగా ఉన్నాయి. రైతుల ప్రాణాలు తీసేలా ఇనుప మొనలతో కాంక్రీట్ తో నిర్మించారు. ఇలా రైతులతో యుద్ధం చేస్తున్నారా? అని రాహుల్ విమర్శించాడు. బీజేపీ సర్కార్ రైతుల విషయంలో చేపడుతునప్న భద్రతా చర్యలపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రియాంకగాంధీ కూడా ఈ వీడియోను షేర్ చేసి బీజేపీ సర్కార్ ను కడిగేసింది.