Begin typing your search above and press return to search.
యువనేతలకు బీజేపీ బహుమానం.. మాములుగా లేదుగా?
By: Tupaki Desk | 19 Nov 2020 1:00 PM ISTబీజేపీకి కాగల కార్యం ఆ ఇద్దరు యువనేతలు తీర్చేశారట.. అందుకే ఇప్పుడు మోడీ కేబినెట్ లో ఇద్దరికీ కేంద్రమంత్రి పదవులు ఖాయం అయిపోయాయట.. వారే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన మధ్యప్రదేశ్ యువనేత జ్యోతిరాధిత్య సింధియా, బీహార్ లో బీజేపీ అఖండ మెజార్టీకి కారణమైన ఎల్జేపీ నేత చిరాగ్ పాశ్వాన్. ఈ ఇద్దరు కూడా బీజేపీని రెండు రాష్ట్రాల్లో నిలబెట్టారు. ఒకరు ఓడిపోయి ఈ పనిచేస్తే.. మరొకరు కాంగ్రెస్ ను దెబ్బకొట్టి బీజేపీని గెలిపించారు. అందుకే వీరికి మంత్రి పదవులు ఇవ్వాలని కేంద్రం డిసైడ్ అయ్యిందట..
మధ్యప్రదేశ్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజానికి గెలిచింది కాంగ్రెస్ పార్టీ. అయితే బోటాబోటీ మెజార్టీ రావడం.. సీఎం సీటు కోసం కాంగ్రెస్ లో సీనియర్ కమల్ నాథ్, జూనియర్ యువ నేత జ్యోతిరాధిత్య సింధియా పోటీపడ్డారు. ఆ పోరులో సింధియా 25మంది ఎమ్మెల్యేలతో అసమ్మతి రాజేసి బీజేపీలో చేరాడు. తాజా ఉప ఎన్నికల్లో ఆ 25మందిలో 19మంది గెలిచి తిరిగి మధ్యప్రదేశ్ లో బీజేపీ సర్కార్ నిలబడింది. మరి ఇంత చేసిన సింధియాకు కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చి గౌరవించబోతోందని మోడీ సర్కార్.
ఇక బీహార్ లోనూ జేడీయూని వ్యతిరేకించి ఏకంగా 135 స్థానాల్లో చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ పోటీచేసింది. కానీ ఒక్కటే సీటు గెలవగలిగింది. కానీ ఓట్లను భారీగా చీల్చి అటు ఆర్జేడీని గెలవకుండా.. ఇటు జేడీయూకు ఎక్కువ సీట్లు వచ్చేలా చేసింది. తద్వారా బీజేపీకి అత్యధిక సీట్లు కట్టబెట్టింది. ఇలా ఓడిపోయినా కూడా చిరాగ్ పాశ్వాన్ కేంద్రంలోని బీజేపీకి మేలు చేశాడు. నితీష్ ను డమ్మీ సీఎంగా బీజేపీ చక్రంతిప్పేలా చేశాడు.
ఈ ఇద్దరు యువనేతలకు ఇప్పుడు కేంద్రంలో మంత్రి పదవులు రెడీగా ఉన్నాయట.. ఇక బీజేపీ బీహార్ రాష్ట్ర అధ్యక్షుడు సుశీల్ మోడీకి కూడా కేంద్ర కేబినెట్ లో ఎంట్రీ ఖాయమన్న ప్రచారం సాగుతోంది. మొత్తానికి బీజేపీ రాజకీయాలు ప్రత్యర్థుల కొంప కూల్చేవిగా ఉండడం విశేషం.