Begin typing your search above and press return to search.
దేశం మెడపై కమలం 'కత్తి'
By: Tupaki Desk | 27 July 2018 2:59 PM ISTవచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీయే లక్ష్యంగా బరిలోకి దిగనుంది భారతీయ జనతా పార్టీ. 2014 ఎన్నికలలో తమతో చేతులు కలిపి - కలకాలం కాపురం చేస్తుందనుకున్న తెలుగుదేశం పార్టీ - తమను వీడి వేరు కుంపటి పెట్టడం బిజేపి నాయకులకు మింగుడుపడడంలేదు. తమ గెలుపు మాట ఎలా ఉన్న చంద్రబాబు మాత్రం తిరిగి అధికారంలోకి రాకూడదని బిజేపి పట్టుదలగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు వైఖరిపై బిజేపీ నేతలు రగిలిపోతున్నారు. వచ్చే ఎన్నికలలో చంద్రబాబు నాయుడిని ఓడించడానికి పకడ్బందిగా వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే బిజేపి అధిష్టానం కొత్త కార్యవర్గాన్ని నియమించింది. ఇందులో చంద్రబాబు నాయుడిని నిత్యం దుమ్మేత్తిపోసే నాయకులు తెలుగుదేశం పార్టీ అంటే విరుచుకుపడే వారిని ఈ నూతన కార్యవర్గంలో అభ్యర్దులుగా నియమించిందని తెలుస్తోంది.
ఎన్నికలలో ప్రత్యర్దులను విమర్శించడం పరిపాటే - కాని ఆంధ్రప్రదేశ్ లో మాత్రం కేవలం తెలుగుదేశం పార్టీని ఇరుకున పెట్టడానికి బిజేపి బరిలోకి దిగుతోంది, మొత్తం19 మంది సభ్యులతో కూడిన కార్యవర్గంలో సత్యమూర్తి - సురేశ్ రెడ్డి - మాణిక్యాలరావ్ - శ్యామ్ కిశోర్ ల తో పాటు కొంత మంది అధికార ప్రతినిధులు కూడా ఉన్నాట్టు సమాచారం. తమపై వచ్చిన విమర్శలను - దుష్ప్రచారన్ని తిప్పికొట్టడమే మా లక్ష్యం అని పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ. వారి ఉద్దేశం మాత్రం తెలుగుదేశం పార్టీని ఇబ్బందుల పాలు చేసి - ఓటమి పాలు చేయడమే అని తెలుస్తోంది.